నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ ఒక విలాసవంతమైన ఇల్లు (Luxury House), ఒక మంచి కారు ఉండాలని కోరిక ఉంటుంది. అయితే, ఇవన్నీ కేవలం ధనవంతులకే సాధ్యమని, మనలాంటి తక్కువ జీతం వచ్చే వారికి ఇవి అందనని ద్రాక్ష అని మీరు అనుకోవచ్చు.
కానీ నెలకు కేవలం రూ. 25 వేలు సంపాదించే వ్యక్తి కూడా ఈ కలని నిజం చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇది వినడానికి కొంచెం కష్టంగా అనిపించినా, సరైన ప్రణాళిక (Planning) మరియు క్రమశిక్షణ ఉంటే ఇది సాధ్యమే. తక్కువ జీతంతో కోటీశ్వరులు అయ్యే ఆ మార్గం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
తక్కువ జీతంతోనే పెద్ద కల నిజమవుతుంది!
బిజినెస్ కోచ్ దీపక్ వాధ్వా తెలిపిన వివరాల ప్రకారం.. మీ జీతం తక్కువైనా పర్వాలేదు, మీ ప్లాన్ పక్కాగా ఉంటే మీ లైఫ్ స్టైల్‌ను మార్చుకోవచ్చు. “రూ. 25 వేల జీతంతో ఫార్చ్యూనర్ కారు, పెద్ద ఇల్లు ఎలా సాధ్యం అని చాలామంది అడుగుతుంటారు, కానీ లెక్కలు ఎప్పుడూ అబద్ధం చెప్పవు” అని ఆయన అంటారు. దీనికంతటికీ కావాల్సిన ఒకే ఒక మంత్రం ‘క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి’.
ఏంటా 25 వేల మ్యాజిక్ సూత్రం?
ఇక్కడ అసలైన మ్యాజిక్ ‘SIP’ (Systematic Investment Plan) లో ఉంది. వాధ్వా సూత్రం చాలా సింపుల్.
- మీ రూ. 25 వేల జీతంలో, నెలకు కేవలం రూ. 5,000 ఎస్ఐపీలో పెట్టుబడి పెట్టాలి.
- ప్రతి ఏడాది మీ జీతం పెరిగిన కొద్దీ, ఈ పెట్టుబడిని కూడా 20% పెంచుకుంటూ పోవాలి (Step-up SIP).
- ఇలా మీరు వరుసగా 15 ఏళ్ల పాటు చేస్తే, చక్రవడ్డీ (Compound Interest) పవర్‌తో మీ దగ్గర సుమారు రూ. 1.5 కోట్లు జమ అవుతాయి.
పని చేయకుండానే నెలకు రూ. 2 లక్షల ఆదాయం!
మీ దగ్గర రూ. 1.5 కోట్లు ఉన్నప్పుడు, దానిని నేరుగా ఖర్చు చేయకూడదు. దానిని ‘SWP’ (Systematic Withdrawal Plan) గా మార్చుకోవాలి. అంటే ఆ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఉంచి, దాని ద్వారా వచ్చే లాభాన్ని నెలనెలా ఆదాయంగా పొందడం. నిపుణుల ప్రకారం, ఇలా చేస్తే రాబోయే 30 ఏళ్ల వరకు మీరు నెలకు సుమారు రూ. 2 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. ఈ డబ్బుతోనే మీరు మీ కారు, ఇంటి ఈఎంఐ (EMI)లను సులభంగా చెల్లించవచ్చు.
ఓపిక ఉంటేనే విజయం మీ సొంతం!
ఇది వినడానికి బాగున్నా, ఆచరించడం అంత సులభం కాదు. దీనికి కావాల్సింది ఓపిక మరియు క్రమశిక్షణ. ఇది రాత్రికి రాత్రే ధనవంతులు చేసే పథకం కాదు. 15 ఏళ్ల పాటు నిరంతరంగా పెట్టుబడి పెట్టే పట్టుదల ఉండాలి. ఎస్ఐపీలో దీర్ఘకాలంలో 12 నుండి 15 శాతం, ఒక్కోసారి 18 శాతం వరకు కూడా రాబడి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ రోజు నుండే ప్లాన్ చేయండి, చిన్న మొత్తంతోనైనా పొదుపు ప్రారంభించి మీ కలల ఇల్లు-కారుని సొంతం చేసుకోండి!
