కొవ్వు గడ్డలు (Lipoma) అనేవి చర్మం కింద ఏర్పడే మెత్తని, క్యాన్సర్ కారకం కాని కొవ్వు కణజాలాల పెరుగుదల. ఇవి సాధారణంగా నొప్పిని కలిగించవు మరియు తాకినప్పుడు అటు ఇటు కదులుతాయి. ఇవి ప్రధానంగా వీపు, భుజాలు, మెడ మరియు చేతులపై కనిపిస్తాయి.
1. కొవ్వు గడ్డలు రావడానికి కారణాలు:
- కొవ్వు కణాలు అధికంగా పెరగడం వల్ల ఇవి ఏర్పడతాయి.
- వంశపారంపర్యం: కుటుంబంలో ఎవరికైనా ఉంటే ఇవి వచ్చే అవకాశం ఉంది.
- గాయం: ఏదైనా దెబ్బ తగిలిన చోట కొవ్వు కణాలు ఎక్కువగా పెరిగి గడ్డలా మారవచ్చు.
- బరువు: అధిక శరీర బరువు కూడా ఒక కారణం కావచ్చు.
- వయస్సు: ఇవి సాధారణంగా 40 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తాయి.
2. లక్షణాలు:
- చర్మం కింద మెత్తగా, గుండ్రంగా లేదా కోడిగుడ్డు ఆకారంలో ఉండే గడ్డ.
- రబ్బరులా అనిపిస్తుంది మరియు తాకినప్పుడు కదులుతుంది.
- సాధారణంగా నొప్పి ఉండదు, కానీ గడ్డ పెద్దదై నరాల మీద ఒత్తిడి కలిగిస్తే నొప్పి రావచ్చు.
- ముఖ్య గమనిక: అరుదైన సందర్భాల్లో ‘లిపోసార్కోమా’ వంటి క్యాన్సర్ గడ్డలు కూడా కొవ్వు గడ్డల్లాగే కనిపించవచ్చు. కాబట్టి అనుమానం ఉంటే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
3. చికిత్స:
- చాలా వరకు ఇవి హాని చేయవు. అయితే గడ్డ మరీ పెద్దదైనా లేదా ఇబ్బందిగా ఉన్నా శస్త్రచికిత్స (Surgery) ద్వారా తొలగించవచ్చు.
- గడ్డ వేగంగా పెరుగుతున్నా, రంగు మారినా, లేదా వాపు వచ్చినా వెంటనే డాక్టరును కలవాలి.
4. ఇంటి చిట్కాలు (Home Remedies):
కొవ్వు గడ్డలను తగ్గించుకోవడానికి కొన్ని సహజ పద్ధతులు:
- ఉప్పు కాపడం: ఒక కాటన్ వస్త్రంలో కొద్దిగా కల్లు ఉప్పును తీసుకుని మూటలా కట్టండి. పెనం మీద కొంచెం నువ్వుల నూనె లేదా ఆముదం వేసి వేడి చేసి, ఆ ఉప్పు మూటను అందులో ముంచి గడ్డపై గోరువెచ్చని కాపడం పెట్టాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే గడ్డలు కరిగే అవకాశం ఉంది.
- చిత్రమూలం నూనె (Kodiveli Oil): ఆయుర్వేద షాపుల్లో దొరికే చిత్రమూలం నూనెను (దీనిని తమిళంలో కొడివేలి అంటారు) గడ్డపై రాసి మసాజ్ చేయడం వల్ల గడ్డలు మాయమవుతాయి.
- శరీర శుద్ధి: శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల కూడా ఇవి రావచ్చు. కాబట్టి సహజమైన మలమూత్ర విసర్జనలను ఆపకుండా (Urges suppress చేయకుండా) ఉండటం వల్ల వీటిని నివారించవచ్చు.
- ఆరెంజ్ పండ్లు: ఆరెంజ్ పండ్లలో విటమిన్లు మరియు సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని అనవసరమైన కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. కాబట్టి రోజూ ఒక ఆరెంజ్ పండు తినడం మంచిది.
