కర్ణాటకలో గత 7 నెలలుగా మిస్టరీగా ఉన్న 65 ఏళ్ల వృద్ధురాలి దారుణ హత్య కేసులో, ఆమె సొంత కుటుంబ సభ్యులే అరెస్టు కావడం తీవ్ర కలకలం రేపింది.
బాగల్కోట్ జిల్లా బిళగి ప్రాంతంలోని వీరదేవర ఆలయంలో నిద్రిస్తున్న గౌరవ్వ కోడేకల్ అనే వృద్ధురాలిని గత మార్చి 19వ తేదీ అర్ధరాత్రి రాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు.
ఈ కేసులో వృద్ధురాలి మనవడు పడియప్ప, కోడలు శాంతవ్వ, శాంతవ్వ సోదరి కుమారుడు శంకర్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్య వెనుక ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
వృద్ధురాలి పేరు మీద ఉన్న 5 ఎకరాల భూమిని తమ పేరు మీదకు మార్చాలని వారు నిరంతరం ఒత్తిడి తెచ్చేవారు. అంతేకాకుండా, కోడలు శాంతవ్వ వివాహేతర సంబంధాన్ని వృద్ధురాలు మందలించడంతో పాటు, ఆ విషయాన్ని ఊరి జనం ముందు బయటపెట్టి అవమానించిందనే ఆగ్రహంతోనే ఈ ఘోరానికి ఒడిగట్టారు.
ఈ హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్లు నాటకమాడిన మనవడు పడియప్ప స్వయంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు. సుమారు 30,000 మందిని విచారించి, 7 నెలల పాటు ముమ్మరంగా గాలించిన తర్వాత పోలీసులు ఈ కేసులో అసలు నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు.

Leave a Reply