‘కో-స్టార్ నిన్ను ప్రెగ్నెంట్ చేశాడా?’.. 26 ఏళ్ల నటిని బహిరంగంగానే ఆ మాట అడిగిన బాలీవుడ్ సూపర్ స్టార్!

బాలీవుడ్ మొదటి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా, దిగ్గజ నటి మౌషుమి ఛటర్జీల ఆన్‌స్క్రీన్ జోడిని ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడినప్పటికీ.. తెర వెనుక మాత్రం వీరిద్దరి మధ్య సంబంధాలు చాలా వివాదాస్పదంగా ఉండేవి.

నటి మౌషుమి ఛటర్జీ ఒక ఇంటర్వ్యూలో రాజేష్ ఖన్నాకు సంబంధించి పలు దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించారు.

రాజేష్ ఖన్నాపై మౌషుమి ఛటర్జీ సంచలన వ్యాఖ్యలు సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా తరచూ సెట్స్‌లో అసభ్యకరమైన హాస్యాలు చేసేవారని, ఒకసారి ఆయన తన గర్భం (ప్రెగ్నెన్సీ) గురించి అడిగిన ప్రశ్న విని తాను షాక్‌కు గురయ్యానని మౌషుమి ఛటర్జీ తెలిపారు. అయితే తాను కూడా అదే స్థాయిలో ఆయనకు ఘాటుగా సమాధానం ఇచ్చానని చెప్పారు. ఇంత జరిగినప్పటికీ, రాజేష్ ఖన్నా చివరి రోజుల్లో ఆమె ఆయనను కలవడానికి వెళ్లడం గమనార్హం.

1972లో బాలీవుడ్‌లో మౌషుమి ఎంట్రీ మౌషుమి ఛటర్జీ కోల్‌కతాలో ఇందిరా చట్టోపాధ్యాయగా జన్మించారు. ఆమె చిన్న వయసులోనే ప్రముఖ సింగర్ హేమంత్ కుమార్ కుమారుడైన జయంత్ ముఖర్జీని వివాహం చేసుకున్నారు. మౌషుమి అనుకోకుండానే సినిమాల్లోకి ప్రవేశించారు. 1972లో శక్తి సామంత్ దర్శకత్వంలో వచ్చిన ‘అనురాగ్’ సినిమాతో ఆమె హిందీ చిత్రసీమకు పరిచయమయ్యారు. ఇందులో ఆమె ఒక అంధురాలైన యువతి పాత్రను పోషించారు.

రాజేష్ ఖన్నా – మౌషుమి ఛటర్జీల మధ్య వివాదం 1974లో ‘హమ్‌షకల్’ సినిమా సెట్స్‌లో మౌషుమి ఛటర్జీ, రాజేష్ ఖన్నాలను కలిసినప్పటికే.. ఆమె బాలీవుడ్‌లో అత్యంత క్రేజ్ ఉన్న నటీమణులలో ఒకరిగా ఎదిగారు. తెరపై వీరి కెమిస్ట్రీ సూపర్ హిట్‌గా నిలిచినప్పటికీ, తెర వెనుక పరిస్థితులు వేరుగా ఉండేవి.

‘ఇది వినోద్ మెహ్రా బిడ్డేనా?’ అని అడిగిన రాజేష్ ఖన్నా

  • ఎన్‌డీటీవీ (NDTV)కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మౌషుమి ఛటర్జీ మాట్లాడుతూ.. “రాజేష్ ఖన్నాకు అహంకారం ఎక్కువ. విజయం ఎప్పుడూ ఆయన తలకెక్కి ఉండేది” అని పేర్కొన్నారు. ఒక సినిమా షూటింగ్ సమయంలో తాను గర్భవతిగా ఉన్నానని, ఆ సినిమాలో రాజేష్ ఖన్నానే హీరో అని ఆమె తెలిపారు. ఆ సమయంలో రాజేష్ ఖన్నా తన వద్దకు వచ్చి.. “ఇది వినోద్ మెహ్రా బిడ్డేనా?” అని అడిగినట్లు మౌషుమి సంచలన వ్యాక్యాలు చేశారు.
  • మౌషుమి ఛటర్జీ నాటి ప్రముఖ నటుడు వినోద్ మెహ్రాతో కలిసి 10 కంటే ఎక్కువ సినిమాల్లో నటించారు. మౌషుమికి పెళ్లయినప్పటికీ, వినోద్ మెహ్రాతో ఆమెకు అఫైర్ ఉందంటూ అప్పట్లో రూమర్స్ వచ్చేవి. అయితే రాజేష్ ఖన్నా అడిగిన ప్రశ్నకు మౌషుమి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

రాజేష్ ఖన్నాకు మౌషుమి గట్టి కౌంటర్ “రాజేష్ ఖన్నా షూటింగ్ సమయంలో ఏది పడితే అది మాట్లాడేవారు. నా ప్రెగ్నెన్సీపై ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యకు నేను కూడా అంతే ఘాటుగా సమాధానం ఇచ్చాను. ‘మీ ఇద్దరు కుమార్తెలు రిషి కపూర్‌కు పుట్టారా?’ అని నేను ఆ సూపర్ స్టార్‌ను ఎదురు ప్రశ్నించాను. నా సమాధానం వినగానే రాజేష్ ఖన్నా నోట మాట రాలేదు” అని మౌషుమి ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అమితాబ్ బచ్చన్‌తోనూ నటించిన మౌషుమి మౌషుమి ఛటర్జీ నటుడు అమితాబ్ బచ్చన్‌తో కలిసి రెండు సినిమాల్లో నటించారు. 1974లో విడుదలైన ‘బేనామ్’, 1979లో వచ్చిన ‘మంజిల్’ చిత్రాల్లో వారు కలిసి చేశారు. ‘మంजిల్’ సినిమాలోని ‘రిమ్‌ఝిమ్ గిరే సావన్’ పాట నేటికీ ఎంతో పాపులర్. ముంబై వీధుల్లో అసలైన వర్షంలో ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటలో అమితాబ్ బచ్చన్ సోదరుడు అజితాబ్ బచ్చన్ వీరికి డ్రైవర్‌గా కనిపించడం విశేషం.

చివరి రోజుల్లో రాజేష్ ఖన్నాని కలిసిన నటి ఆఫ్-స్క్రీన్ వీరిద్దరి సంబంధం అస్సలు బాగోలేనప్పటికీ, రాజేష్ ఖన్నా చివరి రోజుల్లో మౌషుమి ఆయనను చూడటానికి వెళ్లారు. “ఈ రోజు రాజేష్ ఖన్నా మన మధ్య లేరు. ఆయన చివరి రోజుల్లో నేను కలవడానికి వెళ్లినప్పుడు నా చిన్న కుమార్తె ముందు నన్ను ఎంతో మెచ్చుకున్నారు. ‘మీ అమ్మ పిచ్చిది కావచ్చు, కానీ మేమంతా ఆమెకు భయపడేవాళ్లం. ఆమె ఎలాంటి చెత్త మాటలను సహించేది కాదు’ అని నా కుమార్తెతో చెప్పారు” అని మౌషుమి గుర్తుచేసుకున్నారు.

జూలై 2012లో రాజేష్ ఖన్నా కన్నుమూత జూలై 2012లో రాజేష్ ఖన్నా మరణించారు. చివరి రోజుల్లో రాజేష్ ఖన్నా ఒంటరితనాన్ని చూసి మీకు జాలి అనిపించిందా? అని మౌషుమిని ప్రశ్నించగా.. ఆమె ఒకే ముక్కలో “కర్మ” అని సమాధానం ఇచ్చారు. రాజేష్ ఖన్నా గొప్ప సూపర్ స్టార్ అయినప్పటికీ, ఆయన ప్రవర్తన చాలా వింతగా ఉండేదని ఆమె ముగించారు.


Posted

in

by

Tags: