బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) 2025-26 సీజన్‌లో భాగంగా సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం జరిగింది. 41 ఏళ్ల మహమ్మద్ నబీ, అతని 19 ఏళ్ల కుమారుడు హసన్ ఈసాఖిల్ ఇద్దరూ ‘నోఖాలీ ఎక్స్‌ప్రెస్’ జట్టు తరపున బరిలోకి దిగారు.
రికార్డు భాగస్వామ్యం:
ఢాకా క్యాపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో నబీ – ఈసాఖిల్ జోడీ నాలుగో వికెట్‌కు కేవలం 30 బంతుల్లోనే 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
- కుమారుడి మెరుపులు: హసన్ ఈసాఖిల్ తన అరంగేట్రం (Debute) మ్యాచ్‌లోనే 60 బంతుల్లో 92 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
- తండ్రి సహకారం: మహమ్మద్ నబీ 17 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 2 వికెట్లు పడగొట్టాడు.
నబీ ఏమన్నారంటే?
“నా కుమారుడితో కలిసి ఆడాలని నేను చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. అతడిని ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా తీర్చిదిద్దాను. తన మొదటి మ్యాచ్‌లోనే ఇంత బాగా ఆడటం నాకు చాలా సంతోషాన్నిస్తోంది. మేమిద్దరం క్రీజులో ఉన్నప్పుడు పిచ్ పరిస్థితి గురించి, బంతుల వేగం గురించి మాట్లాడుకున్నాం. త్వరలోనే అతడిని ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జట్టులో చూస్తానని ఆశిస్తున్నాను” అని నబీ ఉద్వేగంగా చెప్పారు.
తండ్రి ఆశయమే నా లక్ష్యం – ఈసాఖిల్:
తండ్రి నబీతో కలిసి జాతీయ జట్టుకు ఆడాలనేది తమ ఇద్దరి కల అని ఈసాఖిల్ తెలిపాడు. “చాలామంది నేను మా నాన్న లాగే బ్యాటింగ్ చేస్తానని చెబుతుంటారు, కానీ నేను ఎవరినీ అనుకరించను. నా శైలిలో ఆడుతూ జట్టును గెలిపించడమే నా లక్ష్యం” అని యువ ఆటగాడు అన్నాడు.
మ్యాచ్ ఫలితం:
మొదట బ్యాటింగ్ చేసిన నోఖాలీ ఎక్స్‌ప్రెస్ 20 ఓవర్లలో 184/7 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢాకా క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 143 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో నోఖాలీ ఎక్స్‌ప్రెస్ 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వరుస ఓటముల తర్వాత ఆ జట్టుకు ఇది వరుసగా రెండో విజయం.
