గారపు ధరలు పెరిగితే ఇలా చేస్తారా? కొడుకులనే ‘ప్రియులుగా’ మార్చిన సంగీత.. టార్గెట్ ధనవంతులైన మహిళలే!

చెన్నై: చెన్నైలో ఒక పారిశ్రామికవేత్త భార్యను వివాహేతర సంబంధం వలలో దించి, అశ్లీల వీడియోలతో బెదిరించి 4 కోట్ల విలువైన నగలను కాజేసిన రాజస్థాన్ ముఠా పట్టుబడింది.

ధనవంతులైన మహిళలను లక్ష్యంగా చేసుకుని సంగీత అనే మహిళ పక్కా ప్లాన్‌తో ఈ మోసానికి పాల్పడినట్లు తేలింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఈ సంగీత పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఏం జరిగింది?
చెన్నై పురసైవాక్కంలో నివసిస్తున్న ఒక పారిశ్రామికవేత్త భార్య (రమ్య)తో, అదే అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగిన దిలీప్ అనే యువకుడు పరిచయం పెంచుకున్నాడు. భర్త పనికి వెళ్ళిన సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. నిరుద్యోగి అయిన దిలీప్ తన విలాసాల కోసం రమ్య దగ్గర నగలు తీసుకోవడం ప్రారంభించాడు. ఆ తర్వాత, ఆమెకు తెలియకుండా తీసిన అశ్లీల వీడియోలను చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.

వీడియోలతో బెదిరింపులు
ఆ వీడియోల ద్వారా భయపెట్టి రమ్య దగ్గర ఉన్న బంగారం, వజ్రాల నగలను దిలీప్ కొద్దికొద్దిగా లాక్కున్నాడు. పొరుగున ఉండే స్నేహితురాలిగా దిలీప్ తల్లి సంగీత చేసిన పరిచయం, చివరకు భారీ దోపిడీకి దారితీసింది. రమ్య నుంచి సుమారు 850 గ్రాముల బంగారం, ఖరీదైన వజ్రాల ఆభరణాలు, మరియు రెండున్నర కిలోల వెండి వస్తువులను వీరు దక్కించుకున్నారు.

పరారీలో దిలీప్
గత 10 రోజుల క్రితం దిలీప్ తన కుటుంబంతో సహా అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఇంట్లో నగలు కనిపించకపోవడంతో షాక్ అయిన పారిశ్రామికవేత్త తన భార్యను నిలదీశాడు. దీంతో రమ్య ఏడుస్తూ దిలీప్ తనను బెదిరించిన విషయాన్ని అంగీకరించింది.

పోలీసుల విచారణ – సంగీత వాంగ్మూలం
వేపేరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దిలీప్ తల్లి సంగీత మరియు తమ్ముడు అంకిత్‌లను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు దిలీప్ నగలతో రాజస్థాన్ పారిపోయినట్లు గుర్తించారు.

సంగీత ఇచ్చిన వాంగ్మూలం పోలీసులను విస్మయానికి గురిచేసింది. మహారాష్ట్రకు చెందిన సంగీత, తన రాష్ట్రం వారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అద్దెకు దిగి, అక్కడ ధనవంతులైన మహిళలతో స్నేహం చేసేది. తన కొడుకులలో ఎవరితో ఆ మహిళలు చనువుగా ఉంటున్నారో గమనించి, వారిని ట్రాప్ చేసేలా ప్లాన్ చేసేది. అలా రమ్యను తన పెద్ద కొడుకు దిలీప్ వలలో పడేలా చేసింది.

బంగారం ధరను అడ్డం పెట్టుకుని..
ప్రస్తుతం బంగారం ధర విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, దీనిని అడ్డం పెట్టుకుని భారీగా లాభపడాలని సంగీత ప్లాన్ చేసింది. అశ్లీల వీడియోలతో బెదిరించి కోట్లాది రూపాయల నగలను దోచుకున్నారు. ఈ కుటుంబంపై ఇప్పటికే మాధవరం, ఐస్‌హౌస్ పోలీస్ స్టేషన్లలో ఇటువంటి మోసం కేసులు ఉన్నట్లు విచారణలో తేలింది.


Posted

in

by

Tags: