నేటి ఆధునిక కాలంలో స్మార్ట్ఫోన్ అనేది మన జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. ఉదయం కళ్ళు తెరిచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ప్రతి అవసరానికి సెల్ఫోన్ అత్యవసరంగా మారిపోయింది.
అయితే, మనతోనే ఎప్పుడూ ఉండే ఈ చిన్న పరికరం కొన్నిసార్లు ఊహించని విధంగా ప్రాణాంతకంగా మారుతుందని చెప్పడానికి ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముఫాఫర్నగర్కు చెందిన 40 ఏళ్ల వికాస్ అంథాల్ (Vikas Anthal) అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై మామూలుగానే ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఆ సమయంలో ఆయన పాకెట్లో ఉన్న సెల్ఫోన్ బ్యాటరీ అకస్మాత్తుగా భారీ శబ్దంతో బాణాసంచా లా పేలింది. ఈ ఊహించని ప్రమాదం కారణంగా అదుపుతప్పి బైక్ నుండి తలకిందులుగా రోడ్డుపై పడిపోయిన ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
ప్రజలకు హెచ్చరిక:
ఈ ఘటన టెక్నాలజీ ప్రపంచంలో మరియు ప్రజలలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మనం రోజూ ఉపయోగించే స్మార్ట్ఫోన్లలో బ్యాటరీ పరిస్థితిపై ఎప్పుడూ అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. మీ సెల్ఫోన్లో బ్యాటరీ ఉబ్బడం, డిస్ప్లే బయటకు రావడం, ఎలాంటి ఉపయోగం లేకుండానే ఫోన్ విపరీతంగా వేడెక్కడం వంటి అసాధారణ మార్పులు ఏవైనా కనిపిస్తే వాటిని ఎప్పుడూ తేలికగా తీసుకోకండి.
అలాగే, ఫోన్ నుండి ఏదో కాలిపోతున్నట్లు వింత వాసన వచ్చినా లేదా మార్కెట్లో లభించే నాణ్యత లేని డూప్లికేట్ ఛార్జర్లను ఉపయోగించినా పేలుడు ప్రమాదం అనేక రెట్లు పెరుగుతుంది. ఒరిజినల్ కంపెనీ ఛార్జర్లను మాత్రమే ఉపయోగించడం, బ్యాటరీని రక్షించుకోవడానికి ఇలాంటి చిన్న లక్షణాలను ప్రారంభంలోనే గుర్తించి వెంటనే సర్వీస్ సెంటర్కు తీసుకెళ్లడం మంచిది.
ఎల్లప్పుడూ బ్యాటరీ పేలాలని లేదు; కానీ ఇలాంటి చిన్న హెచ్చరిక సంకేతాలను ముందుగానే గుర్తించడం పెద్ద ప్రమాపాల నుండి మిమ్మల్ని రక్షించే కవచంలా పనిచేస్తుంది. కాబట్టి, అప్రమత్తంగా ఉండి మీ స్మార్ట్ఫోన్ను సురక్షితంగా ఉపయోగించండి.

Leave a Reply