గుండె తరుక్కుపోతోంది..! వినాయకుడి విగ్రహంతో హఠాత్తుగా జరిగిన ఘోరం.. తృటిలో తప్పించుకున్న 5 నిండు ప్రాణాలు.. భారీ వర్షంతో ముంచుకొచ్చిన ప్రమాదం.. షాకింగ్ వీడియో..!

మహారాష్ట్రలోని నాలాసోపారా పరిధిలోని యశ్వంత్ గౌరవ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 6:00 నుంచి 7:00 గంటల మధ్య తీవ్ర కలకలం రేపిన ఓ ప్రమాదం చోటుచేసుకుంది.

వర్క్‌షాప్ (తయారీ కేంద్రం) నుంచి వినాయకుడి విగ్రహాన్ని ఊరేగింపుగా వాహనంలో తరలిస్తుండగా, ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

కుండపోత వర్షం నుంచి విగ్రహం పాడవకుండా కాపాడేందుకు భక్తులు హుటాహుటిన ప్లాస్టిక్ కవర్లు (షీట్లు) కప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో బ్యాలెన్స్ తప్పడంతో, భారీ గణనాథుడి విగ్రహం ఉన్నట్టుండి ఒక్కసారిగా కిందకు ఒరిగి బోల్తా పడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయి తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. ఆ వీడియోలో.. కిందపడిన భారీ విగ్రహం కింద దాదాపు 4 నుంచి 5 మంది భక్తులు చిక్కుకుపోయిన దృశ్యాలు రికార్డయ్యాయి.

వెంటనే అప్రమత్తమైన స్థానికులు, భక్తులు అక్కడికి పరుగులు తీసి, ఆ భారీ విగ్రహాన్ని పైకి లేపి లోపల చిక్కుకున్న వారిని బయటకు లాగి రక్షించారు. ఈ ప్రమాదంపై నాలాసోపారా పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. ‘అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. కొందరికి స్వల్ప గీతలు, చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయి’ అని స్పష్టం చేశారు.

అనంతరం, ఆ ఘటనలో స్వల్పంగా దెబ్బతిన్న వినాయకుడి విగ్రహాన్ని భక్తులు సురక్షితంగా పైకి ఎత్తి, స్థానిక మండప ప్రాంగణానికి భద్రంగా తరలించారు.


Posted

in

by

Tags: