చైనాలో వ్యాపారులు కస్టమర్లను ఆకర్షించడానికి ఒక విచిత్రమైన అలవాటును పాటిస్తున్నారు. సాధారణంగా ఏదైనా షాపు లేదా రెస్టారెంట్ శుభ్రంగా ఉంటేనే ప్రజలు అక్కడికి వెళ్లడానికి ఇష్టపడతారని మనం భావిస్తాం. కానీ చైనాలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఒక దుకాణం ముందు ఎంత ఎక్కువగా చెత్తాచెదారం, ఖాళీ ఫుడ్ ప్యాకెట్లు పడి ఉంటే.. ఆ దుకాణంలో వ్యాపారం అంత “బిజీగా” జరుగుతోందని అక్కడి ప్రజలు నమ్ముతారట.
వ్యాపార తంత్రం: దుకాణ యజమానులు తమ షాపు ముందు కావాలనే ఆహార పదార్థాలను, కాగితాలను విసిరేసి చెత్తకుప్పలా మారుస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో రికార్డ్ అయ్యాయి. “ఎక్కువ మంది కస్టమర్లు వచ్చి వెళ్తేనే ఇంత చెత్త తయారవుతుంది” అనే ప్రజల సైకాలజీని (Psychology) ఆసరాగా చేసుకుని ఈ వింతైన మోసానికి తెరలేపారు. పరిశుభ్రత కంటే వ్యాపార ట్రిక్కులే ముఖ్యమని భావిస్తున్న చైనీయుల ఈ తీరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు మరియు ఆశ్చర్యానికి దారితీస్తోంది.
