నేటి బిజీ ప్రపంచంలో ఒత్తిడి, ఆందోళన చాలామందికి సాధారణ సమస్యలుగా మారిపోయాయి. కానీ, మనం తెలియకుండా చేసే కొన్ని రోజువారీ అలవాట్లే మన ఆందోళనను మరింత పెంచుతున్నాయని చాలామంది గ్రహించలేకపోతున్నారు.
మన ఆందోళనను మెల్లమెల్లగా పెంచే మూడు ముఖ్యమైన అలవాట్ల గురించి ఇక్కడ చూద్దాం.
మొదటిది, మనకు అసౌకర్యాన్ని కలిగించే కఠినమైన పరిస్థితులను ఎదుర్కోకుండా తప్పించుకోవడం. ఇలా పారిపోవడం ఆ సమయంలో కాస్త ఉపశమనాన్నిఇచ్చినప్పటికీ, మన మెదడుకు తప్పుడు సంకేతాన్ని పంపుతుంది. దీనివల్ల, తదుపరిసారి అదేలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు భయం, ఆందోళన రెట్టింపు అవుతాయి.
రెండవది, ఆందోళనగా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో సమయం వృధా చేయడం, అతిగా తినడం లేదా వస్తువులు కొనుగోలు చేయడం వంటి పనుల ద్వారా మనసును మళ్లించడానికి ప్రయత్నించడం. ఇవి తాత్కాలిక ఓదార్పుని ఇస్తాయే తప్ప, సమస్యకు వాస్తవమైన పరిష్కారాన్ని ఇవ్వవు.
మూడవది, ఎప్పుడూ ఇతరుల నుండి ఓదార్పు మరియు గుర్తింపు కోరడం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా గూగుల్లో వెతికి భయపడటం, ఇతరులను “నేనేమైనా తప్పు చేశానా” అని పదే పదే అడగడం ఆత్మవిశ్వాసాన్ని తగ్గించి, అనుమానాన్ని పెంచుతుంది.
కాబట్టి, ఇలాంటి పరిస్థితుల నుండి పారిపోకుండా, వాటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధం కావాలి. తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చే ఈ అలవాట్లను మానేసి, సమస్యలను నేరుగా ఎదుర్కోవడమే ఆందోళనను తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
