“గూగుల్ కొత్త ఏఐ మోడల్ సంచలన రికార్డు.!” 59 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ‘జెమినీ 4 కార్బన్’.. మునుపటి మోడల్‌ను ఎలా అధిగమించిందంటే.?

సాఫ్ట్‌వేర్ భద్రతలోని లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దగల సామర్థ్యం ఉన్న అప్‌గ్రేడెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ ‘జెమినీ 4 కార్బన్’ (Gemini 4 Carbon) ను గూగుల్ సంస్థ పరిచయం చేసింది.

గతంలో విడుదల చేసిన ‘జెమినీ 4 ఆర్గాన్’ (Gemini 4 Argon) కంటే అనేక రెట్లు వేగంగా పనిచేసేలా ఈ కొత్త మోడల్‌ను అభివృద్ధి చేసినట్లు సంస్థ పేర్కొంది.

రెండు వారాల క్రితమే గూగుల్ సంస్థ జెమినీ 4 ఆర్గాన్ అనే ఏఐ మోడల్‌ను తీసుకువచ్చింది. సుదీర్ఘకాలం పాటు సంక్లిష్టమైన, బహుళ-దశల ఇంజనీరింగ్ పనులను నిర్వహించగల సామర్థ్యంతో దాన్ని రూపొందించారు. ఇప్పుడు దానికంటే మరింత మెరుగైన సామర్థ్యాలతో జెమినీ 4 కార్బన్‌ను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది.

ఏఐ మోడళ్ల సామర్థ్యాలను అంచనా వేసే అనలిటికల్ ఇండెక్స్‌లో (విశ్లేషణాత్మక సూచికలో) జెమినీ 4 కార్బన్ 59 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. దీనికి ముందు వచ్చిన జెమినీ 4 ఆర్గాన్ మోడల్ కేవలం 50 పాయింట్లు మాత్రమే సాధించింది. దీన్ని బట్టి చూస్తే పాత మోడల్ కంటే కార్బన్ అత్యధిక మార్కులు సాధించినట్లు స్పష్టమవుతోంది.

భారీ స్థాయి సాఫ్ట్‌వేర్ కోడ్‌లు, ప్రాథమిక వ్యవస్థల్లోని లోపాలకు (Errors) గల మూల కారణాలను గుర్తించి, వాటిని పరిష్కరించగల సత్తా ఈ కొత్త మోడల్‌కు ఉందని గూగుల్ తెలిపింది. దీని పనితీరుపై ఫీడ్‌బ్యాక్ సేకరించి, భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరిచిన తర్వాత.. వ్యాపార సంస్థలు, సాధారణ ప్రజల వినియోగానికి జెమినీ 4 కార్బన్‌ను విస్తరించాలని గూగుల్ యోచిస్తోంది. దీనికి సంబంధించి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా తన పోస్ట్‌లో ఈ కొత్త మోడల్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.


Posted

in

by

Tags: