గ్లోబల్ ఇన్నోవేషన్‌లో భారత్ కేవలం భాగస్వామి మాత్రమే కాదు, దానికి నాయకత్వం వహిస్తోందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రశంసించారు. అల్ఫాబెట్ (గూగుల్), మైక్రోసాఫ్ట్, ఐబిఎమ్ వంటి దిగ్గజ కంపెనీల పగ్గాలు భారతీయ సంతతి వ్యక్తుల చేతుల్లో ఉండటమే దీనికి నిదర్శనం. ఈ నేపథ్యంలో, ఆ ప్రముఖుల నేపథ్యం మరియు సంపాదనపై ఒక లుక్:
- సుందర్ పిచాయ్ (అల్ఫాబెట్/గూగుల్): తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పిచాయ్ ఆస్తుల విలువ సుమారు రూ. 10,000 కోట్లు. 2022లో ఆయన ప్యాకేజీ దాదాపు 22.6 కోట్ల డాలర్లు.
- సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్): తెలుగు బ్రాహ్మణ నేపథ్యం కలిగిన నాదెళ్ల 2014లో CEO అయ్యారు. ఆయన నికర ఆస్తి విలువ సుమారు రూ. 10,000 కోట్లు. 2024లో ఆయన వార్షిక వేతనం రూ. 680 కోట్లుగా ఉంది.
- నీల్ మోహన్ (యూట్యూబ్): లక్నోలో జన్మించిన ఈయన బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. ఈయన నికర ఆస్తి విలువ దాదాపు రూ. 1,242 కోట్లు.
- శాంతను నారాయణ్ (అడోబ్): హైదరాబాద్‌కు చెందిన ఈయన హిందూ బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చారు. వీరి ఆస్తి విలువ సుమారు రూ. 3,800 కోట్లు.
- అరవింద్ కృష్ణ (IBM): తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఈయన 2020 నుండి IBMకు నాయకత్వం వహిస్తున్నారు. వార్షిక ఆదాయం సుమారు రూ. 165 కోట్లు.
- నికేష్ అరోరా (పాలో ఆల్టో నెట్వర్క్స్): పంజాబీ హిందూ కుటుంబానికి చెందిన నికేష్ ఆస్తి విలువ సుమారు 1.5 బిలియన్ డాలర్లు (రూ. 12,500 కోట్లకు పైమాటే).
- లీనా నాయర్ (షానెల్): కేరళకు చెందిన నాయర్ కమ్యూనిటీకి చెందిన లీనా, లగ్జరీ బ్రాండ్ షానెల్ గ్లోబల్ CEOగా ఉన్నారు. వీరి ఆస్తి విలువ సుమారు రూ. 350 కోట్లు.
