గూగుల్ సంస్థ తన మ్యాప్స్ (Google Maps) యాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తోంది. తాజాగా, కాలినడకన లేదా సైకిల్ పై వెళ్లే వారి కోసం గూగుల్ మ్యాప్స్ ఒక అద్భుతమైన ఫీచర్‌ను పరిచయం చేసింది.
గూగుల్ మ్యాప్స్‌లో జెమిని AI: నడిచేవారు, సైకిల్ తొక్కేవారు మరియు సరైన దిశానిర్దేశం కావాలనుకునే వారి కోసం గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ జెమిని (Gemini) ని మ్యాప్స్‌లోకి తీసుకువచ్చింది. గతంలో ఈ ఫీచర్ కేవలం కారు డ్రైవింగ్ చేసే వారికి మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ మరియు iOS వినియోగదారులందరికీ ఇది లభిస్తుంది.
ముఖ్య గమనిక ఏంటంటే, ప్రస్తుతం జెమిని కేవలం వాయిస్ అసిస్టెంట్ లాగా మాత్రమే పనిచేస్తుంది. అంటే మీరు ప్రశ్నలను టైప్ చేయలేరు లేదా వ్రాతపూర్వక సమాధానాలను పొందలేరు. జెమినిని ఉపయోగించాలంటే మీరు దానితో మాట్లాడాల్సి ఉంటుంది. మీ గమ్యస్థానాన్ని ఎంచుకుని నేవిగేషన్ ప్రారంభించినప్పుడు ఇది మీకు సహాయకారిగా ఉంటుంది.
గూగుల్ మ్యాప్స్‌లో మరికొన్ని కొత్త మార్పులు:
- కొత్త అవతార్: ద్విచక్ర వాహనదారుల కోసం క్లాసిక్ బైక్, స్పోర్ట్స్ బైక్ లేదా స్కూటర్ వంటి 8 రంగుల అవతార్లను ఎంచుకునే సదుపాయం ఉంది. అలాగే 9 భారతీయ భాషల్లో వాయిస్ గైడెన్స్ లభిస్తుంది.
- ట్రాఫిక్ అడ్డంకులు: భారత జాతీయ రహదారుల సంస్థ (NHAI) సహకారంతో రోడ్డుపై ఉన్న అడ్డంకులు, మళ్లింపులు మరియు నిర్మాణ పనుల గురించి తాజా అప్డేట్స్ అందిస్తుంది.
- మెట్రో టికెట్లు: ఎంపిక చేసిన నగరాల్లో నేరుగా గూగుల్ మ్యాప్స్ ద్వారానే మెట్రో రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
- ల్యాండ్‌మార్క్స్: సిగ్నల్స్, స్టాప్ సైన్స్ మరియు సమీపంలోని రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు, ప్రముఖ భవనాల వంటి గుర్తులను (Landmarks) ఇప్పుడు సులభంగా గుర్తించవచ్చు. అలాగే EV ఛార్జింగ్ పాయింట్ల సమాచారం మరియు మీ రాక సమయాన్ని (ETA) స్నేహితులతో పంచుకోవడం ఇప్పుడు మరింత సులభం.
