న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ (LPG) సిలిండర్ల కొరత ఏర్పడుతుందనే ఆందోళన వినియోగదారులలో నెలకొంది. అయితే, గృహ అవసరాలకు వాడే గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని, సామాన్య వినియోగదారుల అవసరాలకే తొలి ప్రాధాన్యత ఇస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
డీలర్లు ఇబ్బంది పెడితే ఏం చేయాలి?
ప్రస్తుతం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల బుకింగ్ గడువును 21 రోజుల నుండి 25 రోజులకు పెంచారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల డీలర్లు సిలిండర్లను బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని లేదా బుక్ చేసినా డెలివరీ ఇవ్వడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. మరికొందరు డీలర్లు అదనపు డబ్బులు అడుగుతున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ డీలర్ గనుక ఇబ్బంది పెడితే, సంబంధిత కంపెనీల అధికారిక హెల్ప్‌లైన్ నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి:
ఇండేన్ గ్యాస్ హెల్ప్‌లైన్ నంబర్లు (Indane Gas):
మీరు ఇండేన్ గ్యాస్ కస్టమర్ అయితే, డీలర్ ఆగడాలపై ఈ నంబర్లలో ఫిర్యాదు చేయవచ్చు:
1800-2333-555 (టోల్ ఫ్రీ)
7718955555 (LPG బుకింగ్ మరియు ఫిర్యాదుల కోసం)
భారత్ గ్యాస్ హెల్ప్‌లైన్ నంబర్లు (Bharat Gas):
సిలిండర్ సకాలంలో అందకపోయినా లేదా డీలర్ అదనపు వసూళ్లకు పాల్పడినా ఈ నంబర్లకు కాల్ చేయండి:
1800-22-4344 (టోల్ ఫ్రీ)
7715012345 (LPG బుకింగ్ కోసం)
హెచ్‌పి గ్యాస్ హెల్ప్‌లైన్ నంబర్లు (HP Gas):
హెచ్‌పి గ్యాస్ వినియోగదారులు తమ ఫిర్యాదుల కోసం ఈ నంబర్లను సంప్రదించవచ్చు:
1800-2333-555 (టోల్ ఫ్రీ)
9493602222 (HP Anytime LPG)
అంతేకాకుండా, వినియోగదారులు నేరుగా కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెబ్సైట్ లేదా సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల పోర్టల్‌లో కూడా ఆన్లైన్ ద్వారా ఫిర్యాదును నమోదు చేయవచ్చు.
