ఘోరం: రైలులో ఫోన్ ట్రాన్స్‌లేటర్ యాప్‌తో మైనర్ బాలికకు వల.. ఆపై లైంగిక దాడి.. నిందితుడికి 12 ఏళ్ల జైలు శిక్ష!

లండన్: కదులుతున్న రైలులో మొబైల్ ఫోన్ ట్రాన్స్‌లేటర్ యాప్‌ను వాడుతూ 13 ఏళ్ల మైనర్ బాలికతో పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నించి, ఆపై ఆమెపై అత్యంత క్రూరంగా లైంగిక దాడికి పాల్పడిన ఒక వలసదారుడికి బ్రిటిష్ కోర్టు 12 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించింది. శిక్షా కాలం ముగిసిన తర్వాత అతడిని బ్రిటన్ దేశం నుండి శాశ్వతంగా బహిష్కరించే (డీపోర్ట్) అవకాశం కూడా ఉంది.

లభించిన వివరాల ప్రకారం.. తజికిస్తాన్ దేశానికి చెందిన 50 ఏళ్ల అబ్దుల్మనోన్ అలీవ్ అనే వ్యక్తి, గతేడాది జూన్ 16 మధ్యాహ్నం సౌత్‌ఎండ్ నుండి లండన్ వెళ్తున్న రైలులో ప్రయాణించాడు. అక్కడ తన సీటుకు ఎదురుగా కూర్చున్న 13 ఏళ్ల బాలికను చూసి, తన ఫోన్ లోని లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్ యాప్ ద్వారా మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఆ వ్యక్తి ప్రవర్తన నచ్చని బాలిక అక్కడి నుండి లేచి వేరే సీటులోకి వెళ్ళిపోయింది.

అయినప్పటికీ వదలకుండా ఆమెను వెంబడించిన అలీవ్.. ఆమె పక్కనే కూర్చుని ఎటూ కదలకుండా లాక్ చేశాడు. అనంతరం అందరి ముందే తన దుస్తులు తొలగించి భయానక వాతావరణాన్ని సృష్టించాడు.

లండన్ కోర్టులో నిరూపితమైన దారుణాలు:
ఇన్నర్ లండన్ క్రౌన్ కోర్టు విచారణలో నిందితుడి క్రూరత్వం పూర్తిగా బట్టబయలైంది. రైలు లండన్ ఫెన్‌చర్చ్ స్ట్రీట్ స్టేషన్‌కు చేరుకునే వరకు అలీవ్ ఆ బాలికపై నిరంతరాయంగా లైంగిక వేధింపులకు మరియు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. రైలు స్టేషన్‌లో ఆగగానే సదరు బాలిక ప్రాణభయంతో వేరే రైలులోకి పారిపోయి అధికారులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఘోరం జరిగిన 11 రోజుల తర్వాత లండన్ పోలీసులు పెక్‌హామ్ ప్రాంతంలో అలీవ్‌ను అరెస్ట్ చేశారు. అతడి ఇంటిని సోదాలు చేసి, నేరం జరిగిన రోజు అతడు ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు.

కోర్టులో ఏడ్చిన నిందితుడు – దేవుడి ఒట్టు అంటూ డ్రామా:
కోర్టు విచారణ సమయంలో నిందితుడు అలీవ్ ఒక తజిక్ అనువాదకుడి (దుభాషియా) సహాయంతో తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా తిరస్కరించాడు. తనకు చర్మ వ్యాధి (స్కిన్ ప్రాబ్లం) ఉందని, అందుకే అలా చేశానని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. జ్యూరీ సభ్యుల ముందు కన్నీరు పెట్టుకుంటూ.. “నాకు భార్య, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. దేవుడిపై ఒట్టు వేసి చెబుతున్నాను, నేనీ తప్పు చేయలేదు. ఈ ఆరోపణలు వినడానికే అసహ్యంగా ఉంది. ఆ అమ్మాయి నా కూతురు లాంటిది” అంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు.

కానీ, సాంకేతిక ఆధారాలు, బాధితురాలి సాక్ష్యం ముందు అతడి డ్రామాలు సాగలేదు. కోర్టు అతడిని దోషిగా తేల్చింది. 12 ఏళ్ల జైలు శిక్షతో పాటు, అతడిని జీవితకాలం పాటు ‘రిజిస్టర్డ్ సెక్స్ అఫెండర్’ (లైంగిక నేరస్థుల జాబితా) లో చేర్చాలని జడ్జి ఆదేశించారు.

సహ ప్రయాణికుడు వారించినా వినని సైకో:
కేసును విచారించిన జడ్జి మాథ్యూ బోయ్ల్ నిందితుడిని తీవ్రంగా మందలించారు. ఆ బాలిక వయసు చిన్నదని, అత్యంత నిస్సహాయ స్థితిలో ఉందని తెలిసి కూడా అలీవ్ పదే పదే ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడని ఆగ్రహం వ్యక్తంచేశారు.

రైలు ప్రయాణంలో ఒకానొక దశలో ఒక సహ ప్రయాణికుడు గమనించి, “ఆమె కేవలం ఒక చిన్న పాప, నీ ప్రవర్తన ఆపు” అంటూ అలీవ్‌ను గట్టిగా హెచ్చరించాడు. ఆ ప్రయాణికుడి చొరవను జడ్జి ప్రత్యేకంగా అభినందించారు. అయితే, ఆ ప్రయాణికుడు వెళ్ళిపోయిన తర్వాత, చుట్టుపక్కల ఎవరూ చూడటం లేదని నిర్ధారించుకున్న అలీవ్.. మళ్లీ ఆ బాలిక వద్దకు వెళ్లి దారుణానికి ఒడిగట్టాడని, ఇది అతడి వక్రీకృత మానసిక స్థితికి నిదర్శనమని కోర్టు వ్యాఖ్యానించింది.


Posted

in

by

Tags: