“చనిపోయాను అనుకున్నావా? ఆస్కార్ లెవల్ యాక్టింగ్ సామీ!”.. బాలుడి ఆటపాటలు, గజరాజు క్యూట్ రియాక్షన్.. వైరల్ అవుతున్న అద్భుత వీడియో!

జంతువులకు, మనుషులకు మధ్య ఉండే విడదీయలేని బంధాన్ని చాటిచెప్పే ఒక వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.

ట్విట్టర్ (X)లో షేర్ చేయబడిన ఈ వీడియోలో, ఒక చిన్నారి చేతిలో నీళ్ల తుపాకీ (Water Gun) పట్టుకుని ఉన్నాడు. అల్లరిగా ఆ బాలుడు ఏనుగు వైపు చూస్తూ తుపాకీతో ‘కాల్చినట్లు’ నటిస్తాడు. ఆ తుపాకీ నుండి నీళ్లు రాగానే, ఆ గజరాజు నిజంగానే బుల్లెట్ తగిలినట్లుగా నటిస్తూ తూలి కింద పడిపోతుంది.

బాలుడు కంగారుగా తుపాకీ పక్కన పడేసి, ఏనుగు దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి దానిని హత్తుకోగానే, ఆ గజరాజు వెంటనే లేచి మళ్ళీ ఆ బాలుడితో ఆడుకోవడం మొదలుపెడుతుంది. ఏనుగు చేసిన ఈ ‘ఆస్కార్’ స్థాయి నటనను చూసిన నెటిజన్లు, “నిజమైన ప్రేమ అంటే ఇదే” అంటూ మురిసిపోతూ కామెంట్స్ చేస్తున్నారు.


Posted

in

by

Tags: