చమురు ఎక్కడ కొనాలో మేమే నిర్ణయిస్తాం.. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తర్వాత జైశంకర్ కుండబద్దలు కొట్టారు!

అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరిన తర్వాత, భారత్ ఆ దేశ ఒత్తిడికి లొంగిపోయిందని, ఇకపై రష్యా నుండి చమురు కొనదని ప్రచారం జరిగింది. విపక్షాలు కూడా దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశాయి. అయితే, మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ (MSC) లో జరిగిన ‘ఢిల్లీ డిసైడ్స్’ చర్చలో విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ స్పందిస్తూ, భారత్ ఎవరి ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

జైశంకర్ ఏమన్నారంటే: “భారత్ తన ఇంధన అవసరాల కోసం చమురు ఎక్కడ కొనాలో భారతదేశమే నిర్ణయిస్తుంది. దేశ ప్రయోజనాల ఆధారంగానే మా నిర్ణయాలు ఉంటాయి. భారత్ చమురు కంపెనీలు (ప్రభుత్వ లేదా ప్రైవేట్) మార్కెట్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాయి. మా ప్రాధాన్యత ఎప్పుడూ ఇంధన భద్రతే (Energy Security). మా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని (Strategic Autonomy) మేము కాపాడుకుంటాం.”

అమెరికా వ్యూహం మరియు భారత్ సమాధానం: అమెరికా భారతీయ ఉత్పత్తులపై టారిఫ్‌లను 50% నుండి 18%కి తగ్గించింది. అయితే దీని వెనుక రష్యా నుండి చమురు కొనడం ఆపివేసి, వెనిజులా వంటి దేశాల వైపు భారత్ మళ్లాలనే షరతు ఉందని వార్తలు వచ్చాయి. దీనిపై జైశంకర్ మ్యూనిచ్‌లో గర్జిస్తూ.. వ్యాపారం తన దారిలో తాను ఉంటుందని, విదేశాంగ విధానం తన దారిలో తాను ఉంటుందని తేల్చి చెప్పారు.


Posted

in

by

Tags: