భారతీయ రైల్వేలోని రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణించే మహిళలకు, ముఖ్యంగా సుదూర ప్రయాణాల్లో రక్షణ ఎంతవరకు ఉందనే ప్రశ్నను లేవనెత్తుతూ ఒక భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. కోర్బా – తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్‌లోని ‘S1’ స్లీపర్ కోచ్‌లో ఒక మహిళా ప్రయాణికురాలు ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో ఆ బోగీలో జనం తక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకున్న ఒక గుర్తుతెలియని వ్యక్తి, ఆమె దగ్గరకు వచ్చి అనుమతి లేకుండా కాళ్లను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.
భయపడిపోయిన ఆ మహిళ, అతడి నుండి దూరంగా జరిగి కిటికీ పక్కన కూర్చుంది. అయితే, ఆ కామాంధుడు అంతటితో ఆగకుండా తన బట్టలు విప్పి, అసభ్యకరమైన చేష్టలకు పాల్పడటమే కాకుండా.. తన శరీరంలోని వెంట్రుకలను పీకి ఆమె కూర్చున్న సీటుపై విసిరేస్తూ పైశాచికానందం పొందాడు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటనను ఆ ధైర్యవంతురాలైన మహిళ తన ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
