“చిన్నారిని పిలిచి చెంపలు వాయించిన కోచ్!”.. మ్యాచ్ జరుగుతుండగానే కోచ్ చేసిన దారుణం.. ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తున్న వీడియో.. గుండెలను పిండేసే ఘటన..!!

కజకిస్థాన్‌లో జరిగిన మహిళల వాలీబాల్ మ్యాచ్ సందర్భంగా, 13 ఏళ్ల బాలికా క్రీడాకారిణి చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల ఆగ్రహం చెందిన కోచ్, ఆమెను దగ్గరకు పిలిచి అత్యంత దారుణంగా కొట్టిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

త తనకు సూచనలు ఇచ్చేందుకే పిలుస్తున్నారని భావించి దగ్గరకు వెళ్లిన ఆ చిన్నారిని, కోచ్ అందరి ముందూ దారుణంగా బాదినప్పటికీ, సహచర క్రీడాకారిణులు ఇచ్చిన ధైర్యంతో ఆ బాలిక మనోధైర్యంతో మ్యాచ్‌ను కొనసాగించి పూర్తి చేసింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కజకిస్థాన్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి.

దీనిపై తక్షణమే స్పందించిన క్రీడా యాజమాన్యం, సంబంధిత కోచ్‌పై 2 సంవత్సరాల పాటు నిషేధం విధించడమే కాకుండా, ఆయన పనిచేస్తున్న క్లబ్ కూడా ఆయన కాంట్రాక్ట్‌ను తక్షణమే రద్దు చేసి బయటకు పంపేసింది.

అంతేకాకుండా, ఈ ఘటనపై పోలీసులు నేరుగా జోక్యం చేసుకుని కోచ్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసి తీవ్ర విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో క్రీడా కోచ్‌లను నియమించే ముందే వారికి సరైన మానసిక పరీక్షలు (Psychological Tests) నిర్వహించాలనే డిమాండ్ బలపడుతోంది.


Posted

in

by

Tags: