కర్ణాటక రాష్ట్రం రామనగర జిల్లా కనకపుర సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో, 3వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలికపై పారిశుద్ధ్య కార్మికుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహావేశాలను రేకెత్తించింది.
రోజులాగే పాఠశాలకు వచ్చిన ఆ బాలిక టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో, అక్కడ శుభ్రం చేసే పనిలో ఉన్న వ్యక్తి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
బాధిత బాలిక భయంతో కేకలు వేయడానికి ప్రయత్నించగా, ఆ దుండగుడు చిన్నారి నోరు నొక్కి భయపెట్టాడు. అంతేకాకుండా, ఈ విషయం బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ చిన్నారి ఏడుస్తూ తరగతి గదికి వెళ్లి టీచర్‌కు జరిగిన విషయం చెప్పింది. వెంటనే ప్రధానోపాధ్యాయులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించి, కనకపుర పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ముమ్మరంగా గాలించి పరారీలో ఉన్న నిందితుడిని ఎట్టకేలకు పట్టుకుని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో.. అతను మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడని, ఖాళీ సమయంలో పార్ట్‌టైమ్ పనిగా ఈ ప్రైవేట్ పాఠశాలలో టాయిలెట్లు శుభ్రం చేసేవాడని తేలింది. పాఠశాల ఆవరణలోనే అభంశుభం తెలియని చిన్నారికి జరిగిన ఈ దారుణం తల్లిదండ్రుల్లో తీవ్ర భయాందోళనలను, ఆగ్రహాన్ని కలిగించింది.

Leave a Reply