“చుట్టుముట్టబడుతున్న తైవాన్ విమానాలు. ‘వన్ చైనా’ విధానం కోసమే ఈ విపరీతమైన చర్యా?” పాకిస్థాన్ తీసుకున్న షాకింగ్ నిర్ణయం. ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసిన ఘటన..!!

చైనాకు చెందిన ‘వన్ చైనా’ (ఒకే చైనా) విధానానికి మద్దతుగా, తైవాన్ దేశానికి చెందిన విమానయాన సంస్థలు తమ గగనతలాన్ని ఉపయోగించకుండా పాకిస్థాన్ నిషేధం విధించింది.

దీని కారణంగా, తైవాన్‌కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థలైన ‘చైనా ఎయిర్‌లైన్స్’ మరియు ‘ఈవా ఎయిర్‌వేస్’ తమ రెగ్యులర్ విమాన మార్గాలను మార్చుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.

అక్టోబర్ 25 నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చినట్లు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ధృవీకరించారు. పాకిస్థాన్ గగనతలంలో కేవలం ప్రధాన చైనాకు చెందిన విమానాలకు మాత్రమే అనుమతి ఉందని, విమానయాన శాఖ విధానాల ప్రకారమే ఈ చర్య తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

స్వయంగా చైనా కూడా నేరుగా ఇలాంటి నిషేధాన్ని విధించని పరిస్థితుల్లో, పాకిస్థాన్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తైవాన్ విమానయాన సంస్థలు ఈ తరహా గగనతల నిషేధాన్ని ఎదుర్కోవడం ఇదే తొలిసారి.

ఈ నిషేధం కారణంగా, ఆసియా మరియు యూరప్ దేశాలకు వెళ్లే తైవాన్ విమానాలు ఇప్పుడు రష్యా, మధ్యప్రాచ్య (మిడిల్ ఈస్ట్) దేశాల మీదుగా సుదూర మార్గాల్లో మళ్లించబడుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల కారణంగా ఇప్పటికే రష్యా గగనతలాన్ని తప్పించుకుంటూ ప్రయాణిస్తున్న విమానాలకు, ప్రస్తుత ఈ సుదూర ప్రయాణ మార్గం వల్ల నిర్వహణ ఖర్చులు, ప్రయాణ సమయం అమాంతం పెరిగే అవకాశం ఉంది.

దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల కూడా ఈ సంస్థలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపనుంది. చైనా మొదటి నుంచీ తైవాన్‌ను తమ దేశంలో అంతర్భాగంగానే పరిగణిస్తోంది. ఇతర దేశాలు కూడా తైవాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించకూడదని చైనా నిరంతరం ఒత్తిడి చేస్తోంది.

చైనా తన ‘బెల్ట్ అండ్ రోడ్’ ప్రాజెక్ట్ కింద పాకిస్థాన్‌లో బిలియన్ల కొద్దీ డాలర్లను పెట్టుబడిగా పెట్టి, ఆ దేశానికి అతిపెద్ద రుణదాతగా ఉన్న తరుణంలో.. ఈ పరిణామం ఆ రెండు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక మితృత్వానికి నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


Posted

in

by

Tags: