అడవి జంతువుల జీవన్మరణ పోరాటాన్ని నమోదు చేసిన ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక చిన్న కోతిని పట్టుకుని, కొండచిలువ తాను దాక్కున్న చెట్టు తొర్రలోకి (Tree Hole) దానిని లాక్కెళ్తున్న దృశ్యాలు ఇందులో రికార్డయ్యాయి.
4 నిమిషాల పోరాటం
సుమారు 4 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో, చిన్న కోతి తనను తాను కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి పూర్తి బలంతో పోరాడుతోంది. కొండచిలువ పట్టు బిగించగా, కోతి విలవిలలాడింది.
సుదీర్ఘ పోరాటం తరువాత, పాము తన పట్టు నుండి కోతి శరీరాన్ని వదిలి, దాని ఒక చేయిని మాత్రమే నోటితో పట్టుకుంది. అక్కడితో వీడియో కట్ చేయబడింది.
వీడియో ముగింపు గురించి స్పష్టంగా తెలియకపోయినా, కోతి ఎలాగైనా బతికి ఉండాలి అని సోషల్ మీడియా వినియోగదారులు ఆత్రుతతో కామెంట్లు పెడుతున్నారు.
