కేరళ కొల్లం జిల్లా మంగాడ్‌లో తన సోదరికి మిఠాయి కొనిచ్చాడనే కారణంతో ఒక వ్యక్తి 17 ఏళ్ల బాలుడిని చంపేందుకు ప్రయత్నించినట్లు ఫిర్యాదు నమోదైంది.
మంగాడ్‌కు చెందిన ఒక వ్యక్తి కుమారుడిపై ఈ దాడి జరిగింది. నిందితుడు బాలుడి పక్కటెముకల్లో కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు షాన్, షినో మాథ్యూ అనే ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
అసలేం జరిగింది? ఈ ఘటన మే 27న (గత నెల) జరిగింది. రాత్రి 12 గంటల సమయంలో బాలుడిని ఇంటి నుండి బయటకు పిలిచి కిరాతకంగా దాడి చేశారు. మొదటి నిందితుడు షాన్ సోదరికి కిండర్ జాయ్ (Kinder Joy) కొనివ్వడమే ఈ దాడికి కారణం. “నా చెల్లెలికి కిండర్ జాయ్ కొనివ్వడానికి నువ్వు ఎవరివిరా?” అని అరుస్తూ షాన్ బాలుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు ప్రస్తుతం కొల్లంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
