“చేతిలో 2000 రూపాయల నోటు ఉందా?” పోస్ట్ ద్వారానే మార్చుకోవచ్చని ఆర్‌బీఐ (RBI) సంచలన ప్రకటన..!!

గత 2023లో చలామణిలో ఉన్న 2,000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటివరకు 98.47 శాతం నోట్లు వెనక్కి వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

అయినప్పటికీ, ప్రజల వద్ద ఇంకా రూ.5,451 కోట్ల విలువైన 2,000 రూపాయల నోట్లు వెనక్కి రాకుండా ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిస్థితుల్లో, ఆ నోట్లను కలిగి ఉన్నవారు వాటిని సులభంగా మార్చుకునేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ ఒక కొత్త సంచలన ప్రకటనను విడుదల చేసింది.

రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన ఈ కొత్త ప్రకటన ప్రకారం, పాత 2,000 రూపాయల నోట్లను కలిగి ఉన్నవారు రిజర్వ్ బ్యాంక్‌కు చెందిన 19 ఇష్యూ కార్యాలయాలకు నేరుగా వెళ్లి లేదా పోస్ట్/కొరియర్ (Post/Courier) ద్వారా పంపి మార్చుకోవచ్చు. పోస్ట్ ద్వారా పంపిన నోట్లను తగిన పరిశీలన మరియు భద్రతా ప్రక్రియల తర్వాత, దానికి సమానమైన మొత్తాన్ని సంబంధిత వ్యక్తుల బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *