ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన ఈవూరి లక్ష్మి (45) అనే మహిళ తెల్లవారుజామున అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు.
ఈ హత్యోదంతం స్థానికంగా తీవ్ర కలకలం, విషాదాన్ని రేకెత్తించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు.
లక్ష్మి కూతురు పుష్పలత, ఆమె ప్రియుడు రాజాలే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మృతురాలి బంధువులు బాహాటంగా ఆరోపిస్తున్నారు. పుష్పలత మొదటి భర్త చనిపోగా, రెండో భర్త కూడా ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత విజయవాడకు చెందిన రాజాతో పుష్పలతకు పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.
వీరి సంబంధాన్ని తల్లి లక్ష్మి తీవ్రంగా వ్యతిరేకిస్తూ అడ్డుగా నిలిచింది. తల్లి వ్యతిరేకతే ఆమె హత్యకు దారితీసిందని, ప్రియుడితో కలిసి జీవించేందుకే పుష్పలత తన కన్నతల్లినే హతమార్చిందని లక్ష్మి బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
