జనవరి 1 నుండి కొత్త రూల్స్.. బ్యాంకులో రూ. 50,000 పైన లావాదేవీలు ఆగిపోవచ్చు! వెంటనే ఇది చేయండి!

బ్యాంకు ఖాతా కలిగిన కస్టమర్లకు 2026 జనవరి 1 నుండి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. పాన్ (PAN) కార్డు ద్వారా రూ. 50,000 కంటే ఎక్కువ నగదును డిపాజిట్ చేయడం లేదా పంపడం వంటి లావాదేవీలలో ఈ మార్పులు రాబోతున్నాయి. కాబట్టి పాన్ కార్డు, బ్యాంకు ఖాతా ఉన్నవారు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి.

చాలామంది కస్టమర్లు తమ పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసే పనిలో ఉన్నారు, ఎందుకంటే దీనికి డిసెంబర్ 31 వరకు గడువు ఉంది. అయితే, అనుసంధానం (Link) చేసిన తర్వాత కూడా చాలామంది దాని స్టేటస్‌ను తనిఖీ చేయడం లేదు. ఒకవేళ మీ పేరు లేదా పుట్టిన తేదీ వివరాలు పాన్ మరియు ఆధార్‌లలో వేర్వేరుగా ఉంటే, మీ లింక్ రిక్వెస్ట్ తిరస్కరించబడే అవకాశం ఉంది.

ఆధార్-పాన్ లింక్ స్టేటస్‌ను తనిఖీ చేసే విధానం:

  1. ముందుగా ఇ-ఫైలింగ్ (e-Filing) పోర్టల్‌కు వెళ్లండి. హోమ్ పేజీలో ఉన్న ‘Link Aadhaar Status’ ఆప్షన్‌ను క్లిక్ చేయండి. అక్కడ మీ పాన్ మరియు ఆధార్ నంబర్లను నమోదు చేస్తే, అవి అనుసంధానమయ్యాయో లేదో తెలిసిపోతుంది.
  2. ఒకవేళ మీరు కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే, హోమ్ పేజీలోని ‘E-PAN’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  3. అందులో ‘Check Status/Download E-PAN’ ఎంచుకుని, ఆధార్ నంబర్ నమోదు చేయండి. మీ మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని ఎంటర్ చేస్తే మీ పాన్ కార్డు స్టేటస్ తెలిసిపోతుంది.

వివరాల సరిచూసుకోవడం: పాన్ మరియు ఆధార్‌లలో పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు వంటి వివరాలు ఒకేలా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. వివరాలు సరిగ్గా ఉంటేనే లింక్ ప్రక్రియ పూర్తవుతుంది, లేదంటే దరఖాస్తు తిరస్కరించబడుతుంది.

డిసెంబర్ 31 గడువు ముగిసిన తర్వాత, మీ పాన్ కార్డు పనిచేయకపోతే (Inoperative), మీరు బ్యాంకులో రూ. 50,000 కంటే ఎక్కువ నగదు జమ చేయలేరు మరియు మీ ఖాతా నుండి పంపలేరు. ఇలాంటి అనేక ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయండి.


Posted

in

by

Tags: