జాగ్రత్త ప్రజలారా.. మధ్యతరగతి వారు డబ్బు, ఆస్తులు కూడబెట్టకపోయినా పర్వాలేదు కానీ, ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుకోవాలి. అత్యవసర సమయాల్లో లేదా పెళ్లిళ్ల వంటి వేడుకల్లో పేపర్ కప్పుల్లో టీ, కాఫీలు తాగే అలవాటు ఉంటే, అందులోని ప్రమాదాలను తప్పక తెలుసుకోండి.
ప్లాస్టిక్ కంటే పేపర్ కప్పులే ప్రమాదకరమా? పేపర్ కప్పులు నిజానికి ప్లాస్టిక్ కంటే ప్రమాదకరమనే దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పేపర్ కప్పులు తడవకుండా ఉండటానికి వాటి లోపలి భాగంలో అత్యంత పలుచని మెైనం (Wax) మరియు ‘పాలిథిలిన్’ ప్లాస్టిక్ పొరను పూస్తారు. ఈ కప్పుల్లో 85°C నుండి 90°C ఉష్ణోగ్రత ఉన్న వేడి టీ లేదా కాఫీని పోసినప్పుడు, ఆ వేడికి లోపల ఉన్న ప్లాస్టిక్ పొర కరిగి పానీయంలో కలిసిపోతుంది.
శరీరంలోకి 75,000 మైక్రో ప్లాస్టిక్ కణాలు: ఒక వ్యక్తి రోజుకు మూడుసార్లు పేపర్ కప్పులో వేడి పానీయాలు తాగితే, అతను సుమారు 75,000 సూక్ష్మ ప్లాస్టిక్ కణాలను (Microplastics) శరీరంలోకి తీసుకుంటున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఈ సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు రక్తంలో కలిసి శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో పేరుకుపోతాయి. ఇది దీర్ఘకాలంలో జీర్ణక్రియ లోపాలు, హార్మోన్ల అసమతుల్యత మరియు ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బతినడానికి కారణమవుతుంది.
అవయవాలపై ప్రభావం: పేపర్ కప్పుల తయారీలో వాడే ‘ఫ్లోరిన్’ వంటి రసాయనాలు కాలేయం (Liver) మరియు కిడ్నీలు పాడవడానికి దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి వైద్యులు కొన్ని సులభమైన మార్పులను సూచిస్తున్నారు:
- టీ షాపులకు వెళ్ళేటప్పుడు వీలైతే వెంట చిన్న స్టీలు గ్లాసును ఉంచుకోవడం మంచిది.
- ఆఫీసుల్లో పింగాణీ లేదా గాజు కప్పులను (Ceramic or Glass cups) ఉపయోగించండి.
- సాంప్రదాయకమైన మట్టి కప్పులలో (Kulhad) టీ తాగడం ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది.
