శరీర దారుఢ్యం అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కోరుకునే అంశంగా మారింది. అయితే, దానిని సాధించడంలో ఒక శ్రామికుడికి, ధనవంతులకు మధ్య చాలా పెద్ద తేడా ఉంది.
రోజుకు 8 గంటలకు పైగా కష్టపడి పనిచేసే ఒక సాధారణ కూలీ, తన రోజువారీ శారీరక శ్రమ ద్వారానే సహజమైన కండరాల బలాన్ని పొందుతాడు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా అతను పడే కష్టమే అతనికి అత్యుత్తమ వ్యాయామంగా మారుతుంది.
మరోవైపు, ధనవంతులు లేదా ఉన్నత వర్గాల వారు రోజూ జిమ్లో ఒక గంట గడిపి, ఖరీదైన ప్రోటీన్ పౌడర్లు, సప్లిమెంట్లను తీసుకుంటూ కండరాలు పెంచేందుకు ప్రయత్నిస్తుంటారు.
ఈ రెండు వర్గాల వారు శరీరాన్ని దృఢంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, వారు ఎంచుకున్న మార్గం, అందుకు అవలంబించే పద్ధతి పూర్తిగా భిన్నమైనవి.
టొమాటో వేరు, బంగాళదుంప వేరు; ఆ రెండింటినీ ఒకదానితో ఒకటి ఎలాగైతే పోల్చలేమో… కృత్రిమ ఆహారాల (సప్లిమెంట్ల) ద్వారా పొందే కండరాల బలాన్ని, సహజంగా కష్టపడి పనిచేయడం ద్వారా వచ్చే కండరాల బలాన్ని ఎప్పటికీ పోల్చలేము.

Leave a Reply