భారతదేశంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా (Vi) మూడు అతిపెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీలు. ఈ కంపెనీలు తమ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రతిరోజూ కొత్త ఆఫర్లను ప్రకటిస్తూనే ఉంటాయి. అయితే, మన పొరుగు దేశమైన పాకిస్తాన్లో ప్రజలు ఏ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తారో మీకు తెలుసా? చాలా మందికి ఈ సమాధానం తెలియదు. పాకిస్తాన్లో ఏ కంపెనీకి ఎక్కువ మంది యూజర్లు ఉన్నారో మరియు అక్కడి ప్రజలు ఏ యాప్‌ల ద్వారా రీఛార్జ్ చేసుకుంటారో ఈ రోజు తెలుసుకుందాం..
పాకిస్తాన్‌లోని ప్రధాన టెలికాం కంపెనీలు: పాకిస్తాన్లో ప్రజలు ప్రధానంగా జాజ్ (Jazz), జోంగ్ (Zong), టెలినార్ (Telenor) మరియు యుఫోన్ (Ufone) వంటి టెలికాం కంపెనీల నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తారు. వీటిలో ఏ కంపెనీ అగ్రస్థానంలో ఉందో ఇప్పుడు చూద్దాం.
ఎవరికి ఎక్కువ మంది కస్టమర్లు ఉన్నారు? సబ్స్క్రైబర్ల సంఖ్య పరంగా జాజ్ (Jazz) కంపెనీ పాకిస్తాన్లో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా టెలినార్, జోంగ్, ఎస్కామ్ (SCO) మరియు యుఫోన్ ఉన్నాయి. మన దేశంలో రిలయన్స్ జియో ఎలాగో, అక్కడ జాజ్ కంపెనీ అలా అన్నమాట.
యూజర్ల సంఖ్య (అంచనా):
- జాజ్ (Jazz): అక్టోబర్ 2025 నాటికి ఈ కంపెనీకి సుమారు 7.2 కోట్ల నుండి 7.3 కోట్ల (72-73 మిలియన్ల) మంది మొబైల్ సబ్స్క్రైబర్లు ఉన్నారు.
- జోంగ్ (Zong) & టెలినార్: వీటికి దాదాపు 5.19 కోట్ల (51.95 మిలియన్ల) మంది చందాదారులు ఉన్నారు.
దీనిని మన దేశంతో పోల్చి చూస్తే.. భారతదేశంలో రిలయన్స్ జియో ఒక్కదానికే 50 కోట్లకు పైగా కస్టమర్లు ఉండటం విశేషం.
రీఛార్జ్ ఏ యాప్‌ల ద్వారా చేస్తారు? భారతదేశంలో ప్రజలు తమ మొబైల్ ఫోన్లను రీఛార్జ్ చేయడానికి ఫోన్‌పే (PhonePe), గూగుల్ పే (Google Pay), అమెజాన్ పే మరియు పేటిఎం వంటి యాప్‌లను ఉపయోగిస్తారు. అదేవిధంగా పాకిస్తాన్లో ప్రజలు తమ నంబర్లను రీఛార్జ్ చేసుకోవడానికి డింగ్ (Ding) మరియు మొబైల్ రీఛార్జ్ (MobileRecharge) వంటి ప్లాట్‌ఫారమ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
