టీమ్ ఇండియాలో ‘వైభవ్’ ప్రకంపనలు! సూర్యకుమార్ కెప్టెన్సీకే ఎసరు? 15 ఏళ్ల కుర్రాడి కోసం దిగ్గజాలకు ఉద్వాసన? బీసీసీఐకి కొత్త తలనొప్పి!

ముంబై: భారత క్రికెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగుతోంది.. అదే వైభవ్ సూర్యవంశీ! ఐపీఎల్ 19వ సీజన్‌లో కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ స్థాయి బౌలర్లను వణికిస్తున్న ఈ ‘యంగ్ సెన్సేషన్’ ఇప్పుడు ఏకంగా టీమ్ ఇండియా సీనియర్ జట్టు తలుపు తడుతున్నాడు. వైభవ్ మెరుపు బ్యాటింగ్ చూస్తుంటే.. త్వరలోనే జరగబోయే ఐర్లాండ్ పర్యటనతో అతను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఈ కుర్రాడి రాక ఇప్పుడు జట్టులోని సీనియర్లకు, ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది.

ఐర్లాండ్ టూర్‌కు షార్ట్‌లిస్ట్.. వీసా ప్రక్రియ షురూ!

పిటిఐ (PTI) నివేదిక ప్రకారం, ఐర్లాండ్ పర్యటన కోసం బీసీసీఐ సిద్ధం చేసిన 35 మంది సభ్యుల ప్రాబబుల్స్ జాబితాలో వైభవ్ సూర్యవంశీ పేరు కూడా ఉంది. ఐర్లాండ్‌కు ప్రత్యేక వీసా అవసరమైన నేపథ్యంలో బీసీసీఐ లాజిస్టిక్స్ విభాగం ముందుగానే ఈ జాబితాను సిద్ధం చేసింది. వైభవ్ గనుక జట్టులోకి వస్తే.. అది సంజూ శామ్సన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అభిమానులకు ‘బ్యాడ్ న్యూస్’ అయ్యే అవకాశం ఉంది.


సూర్యకుమార్ యాదవ్ స్థానానికే ముప్పు?

వైభవ్ ఎంట్రీ కేవలం ఓపెనర్లకే కాదు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానానికి కూడా ఎసరు తెచ్చేలా ఉంది. దీనికి ప్రధాన కారణం సూర్య ఇటివలి ఫామ్.

  • కళ తప్పిన స్కై (SKY): 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ సగటు 20 కంటే తక్కువగా ఉంది.
  • సెలక్టర్ల ముందు సవాల్: అద్భుత ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ లేదా సంజూ శామ్సన్‌లను వైభవ్ కోసం పక్కన పెట్టాలంటే సెలక్టర్లకు బలమైన కారణం ఉండాలి. ఒకవేళ వారిని పక్కన పెట్టి, ఫామ్‌లో లేని సూర్యకుమార్‌ను జట్టులో కొనసాగిస్తే.. విమర్శలు రావడం ఖాయం. ఇది నేరుగా సూర్య కెప్టెన్సీ మరియు జట్టులో అతని స్థానంపై ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది.
ఓపెనింగ్ బెర్త్ కోసం భారీ పోటీ!

ప్రస్తుతం జట్టులో యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్, ఇషాన్ కిషన్ వంటి ధాటిగా ఆడే ఓపెనర్లు ఉన్నారు. వీరంతా ఐపీఎల్‌లోనూ, అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు బాది మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇప్పుడు వైభవ్ రూపంలో మరో అగ్రెసివ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తోడవ్వడంతో.. ఎవరిని ఉంచాలి? ఎవరిని తీసేయాలి? అన్నది బీసీసీఐకి అగ్నిపరీక్షగా మారింది.


Posted

in

by

Tags: