టీ20 వరల్డ్ కప్ నుండి నిష్క్రమణ తర్వాత బంగ్లాదేశ్ యూ-టర్న్.. క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.

టీ20 వరల్డ్ కప్ 2026 నుండి తప్పుకున్న తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్‌లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) వివాదాస్పద డైరెక్టర్ ఎం. నజ్ముల్ ఇస్లాంను తిరిగి ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

‘ఇండియా ఏజెంట్’ వ్యాఖ్యలతో మొదలైన వివాదం గతంలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌ను ఉద్దేశించి ‘ఇండియా ఏజెంట్’ అని నజ్ముల్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. దీనివల్ల అతన్ని పదవి నుండి తొలగించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే, అతను ఇచ్చిన వివరణ పట్ల బోర్డు సంతృప్తి వ్యక్తం చేస్తూ, మళ్ళీ పదవిని అప్పగించింది.

ఐసీసీ నిర్ణయాన్ని ఆమోదించిన బోర్డు టీ20 వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చిన ఐసీసీ నిర్ణయాన్ని తాము సవాలు చేయబోమని BCB స్పష్టం చేసింది. ఐసీసీ డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీకి వెళ్లే ఆలోచన లేదని బోర్డు మీడియా కమిటీ ఛైర్మన్ అమ్జద్ హుస్సేన్ తెలిపారు.

భారత్‌లో ఆడకూడదనే ప్రభుత్వ నిర్ణయమే కారణం బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు వెళ్లి ఆడకూడదని తమ ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయించిందని అమ్జద్ హుస్సేన్ వెల్లడించారు. “ప్రభుత్వ నిర్ణయాన్ని మేము ఐసీసీకి తెలిపాము. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఆడటం సాధ్యం కాదని చెప్పాము. మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలనే మా ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించడంతో మాకు మరో దారి లేకపోయింది” అని ఆయన వివరించారు.


Posted

in

by

Tags: