2026 టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7న ప్రారంభమై, నెల రోజుల ఉత్కంఠభరిత పోరాటాల తర్వాత ఫైనల్‌కు చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య తుది సమరం జరగనుంది. సొంత గడ్డపై, అభిమానుల సమక్షంలో ట్రోఫీ గెలవాలని సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియాపై భారీ ఒత్తిడి ఉంది. గతంలో టీ20 ప్రపంచకప్‌లలో కివీస్ జట్టుపై భారత్‌కు మెరుగైన రికార్డు లేకపోవడం గమనార్హం.
టీ20 ప్రపంచకప్ 2007లో ప్రారంభమైంది. ప్రస్తుతం 2026లో జరుగుతున్నది 10వ ఎడిషన్. ఇప్పటివరకు ఏ జట్టు ఎన్నిసార్లు ఛాంపియన్‌గా నిలిచిందో ఇక్కడ చూడండి:
టీ20 ప్రపంచకప్ విజేతల జాబితా (2007-2024):
- 2007: భారత్ (ఫైనల్లో పాకిస్థాన్‌పై 5 పరుగుల తేడాతో విజయం)
- 2009: పాకిస్థాన్ (శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో విజయం)
- 2010: ఇంగ్లాండ్ (ఆస్ట్రేలియాపై 7 వికెట్ల తేడాతో విజయం)
- 2012: వెస్టిండీస్ (శ్రీలంకపై 36 పరుగుల తేడాతో విజయం)
- 2014: శ్రీలంక (భారత్‌పై 6 వికెట్ల తేడాతో విజయం)
- 2016: వెస్టిండీస్ (ఇంగ్లాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం)
- 2021: ఆస్ట్రేలియా (న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో విజయం)
- 2022: ఇంగ్లాండ్ (పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం)
- 2024: భారత్ (దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం)
