మీ దగ్గర ఆండ్రాయిడ్ (Android) ఫోన్ ఉందా? కానీ మీ ఫోన్ రానురాను స్లో అవుతుందా? దీనివల్ల మీకు కోపం వస్తుందా? మీ ఫోన్ యొక్క పనితీరును పెంచడానికి, బ్యాటరీ జీవితాన్ని పెంచడానికి ఏం చేయాలి అనే ప్రశ్న మీకు కలిగిందా?
అయితే తప్పకుండా ఈ వార్తను ఒక్కసారి చదవండి.
ఈ మధ్య విడుదల అవుతున్న అన్ని ఆండ్రాయిడ్, ఐఫోన్లలో ప్రాసెసర్, ర్యామ్ మరియు అధిక స్టోరేజ్ సామర్థ్యం ఉండటం వల్ల అవి చాలా వేగంగా పనిచేస్తాయి. కానీ మనలో చాలా మంది స్మార్ట్‌ఫోన్‌లో క్యాష్డ్ డేటా (Cached data), అనవసరమైన ఫైల్స్, ఫోల్డర్లను నింపుకుని, అది వేగంగా పని చేయకుండా చేస్తారు.
ఇలాంటి సమయంలో మీరు అనవసరమైన ఫైల్స్‌ను డిలీట్ చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ మీకు స్పేస్ చాలక విసుగు కలిగే అవకాశం ఉంది. ఫోన్లో స్టోరేజ్ స్పేస్ ఎంత మిగిలి ఉంటే, మీ ఫోన్ హ్యాంగ్ అవ్వడాన్ని అంతగా తప్పించవచ్చు. అయితే దీనికి ఏం చేయాలో ఇప్పుడు చెబుతాను చూడండి.
ముందుగా ఉపయోగించని యాప్‌లను డిలీట్ చేయండి
మీ స్టోరేజ్ స్థలాన్ని ఖాళీ చేయడానికి మీరు చేయగలిగే మొదటి పని, అనవసరమైన యాప్‌లను అన్ఇన్స్టాల్ చేయడం. సాధారణంగా ఏదో ఒక కారణం చేత కొన్ని యాప్‌లను డౌన్లోడ్ చేస్తాం. కానీ తర్వాత రోజుల్లో ఈ యాప్‌లు మనకు అంతగా ఉపయోగపడవు, కొన్నిసార్లు వీటిని ఉపయోగించడం కూడా మానేసి ఉంటాం. అయినా కూడా ఇలాంటి నిరుపయోగమైన అప్లికేషన్లు మన ఫోన్లోనే ఉండిపోతాయి.
దీనివల్ల ఫోన్ స్టోరేజ్ నిండిపోతుంది. కాబట్టి ఉపయోగం లేని అప్లికేషన్లను అన్ఇన్స్టాల్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ మొబైల్లో స్టోరేజ్ ఫ్రీ అవ్వడమే కాకుండా, ఫోన్ వేగం కూడా కొద్దిగా పెరుగుతుంది.
యాప్‌ల క్యాష్ మరియు డేటాను క్లియర్ చేయండి
చాలా మంది ఫోన్లో ఉన్న యాప్‌లను క్లియర్ చేసిన తర్వాత ఫోన్ స్టోరేజ్ కూడా పెరుగుతుందని అనుకుంటారు. కానీ అది తప్పు. మీరు ఫోన్ నుండి యాప్‌ను డిలీట్ చేసిన వెంటనే స్టోరేజ్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు, మొదట్లో ఎలా ఉంటుందో, తర్వాత కూడా అంతే ఉంటుంది.
ఎందుకంటే మీరు డిలీట్ చేసిన యాప్ యొక్క డేటా మరియు క్యాష్ అలాగే ఉంటాయి. దీనిని క్లియర్ చేయండి. ఇలా నియమితంగా చేయడం వల్ల ఎప్పుడూ నిర్దిష్ట స్టోరేజ్ స్పేస్‌ను మీ ఫోన్లో కాపాడుకోవడానికి ఇది మీకు సహాయం చేస్తుంది.
మీ మొబైల్ యొక్క సెట్టింగ్‌లను ఓపెన్ చేసి, అక్కడ యాప్స్ లేదా అప్లికేషన్స్ అనే విభాగాన్ని క్లిక్ చేసి, ఇక్కడ యాప్‌ల క్యాష్ మరియు డేటాను క్లియర్ చేయండి. ఒకవేళ ఇలా చేస్తే ఫోన్ వేగం కొద్దిగా పెరుగుతుంది.
ఫోటోలు – వీడియోలు డిలీట్ చేయండి
ఆన్లైన్ ఫోటోలు మరియు వీడియోలను సేవ్ చేయడం తగ్గించండి. మొబైల్లో ఎక్కువ స్థలాన్ని తీసుకునేవి ఫోటోలు మరియు వీడియోలే. ఈ సమస్య నుండి దూరమవడానికి ఫోటోలు మరియు వీడియోలను మొబైల్లో సేవ్ చేసే బదులు క్లౌడ్ స్టోరేజ్‌లో సేవ్ చేయవచ్చు. అన్ని గూగుల్ అకౌంట్లతో పాటు వినియోగదారులకు 15 జీబీ ఫ్రీ స్టోరేజ్ సౌకర్యం ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ ఫోటోలు, వీడియోలను సేవ్ చేయవచ్చు.
ఫోన్‌ను అప్డేట్ చేస్తూ ఉండండి
ఫోన్ కంపెనీల వారు అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తుంటారు. మీరు మీ ఫోన్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం కూడా ముఖ్యమవుతుంది. అప్డేట్లో సెక్యూరిటీ ప్యాచ్ కూడా కలిసి ఉంటుంది. ఆ కారణంగా మీరు అప్పుడప్పుడు కొత్త అప్డేట్ వచ్చినప్పుడల్లా ఫోన్‌ను అప్డేట్ చేయడం ముఖ్యమవుతుంది. ఇది ఆండ్రాయిడ్‌లో ఉన్న లోపాలు లేదా దోషాల వల్ల ఏర్పడే సమస్యల నుండి మరియు సాధ్యమయ్యే భద్రతా ఉల్లంఘన నుండి కాపాడుతుంది.
ఈ విధంగా చేయడం వల్ల మీ ఫోన్ మునుపటి కంటే వేగం పుంజుకుంటుంది. అంతేకాకుండా స్టోరేజ్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మొబైల్ యొక్క బ్యాటరీ పైనా మంచి ప్రభావం చూపుతుంది.
