స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని యాప్స్ ఓపెన్ చేయగానే స్క్రీన్‌పై ప్రకటనలు పాప్-అప్ అవుతుంటాయి. దీనివల్ల సమయం వృధా అవ్వడమే కాకుండా, ముఖ్యమైన పనులు చేసుకునేటప్పుడు అంతరాయం కలుగుతుంది. పొరపాటున ఒక యాడ్‌పై క్లిక్ చేస్తే, అదే రకమైన ప్రకటనలు మళ్ళీ మళ్ళీ వచ్చి చికాకు పెడుతుంటాయి. ఈ సమస్య నుండి బయటపడటానికి ఆండ్రాయిడ్ ఫోన్లలో ఒక అద్భుతమైన ‘హిడెన్ సెట్టింగ్’ ఉంది.
ప్రకటనల నుండి విముక్తి ఎలా? ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్రైవేట్ DNS (Private DNS) అనే సెట్టింగ్ ఉంటుంది. దీనిని ‘DNS-over-TLS’ అని కూడా పిలుస్తారు. ఈ సెట్టింగ్ ఆన్ చేస్తే ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండానే బ్రౌజర్ మరియు ఇతర యాప్స్‌లో వచ్చే ప్రకటనలను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేయవచ్చు.
ప్రైవేట్ DNS అంటే ఏమిటి? ఇది ఇంటర్నెట్ కనెక్షన్‌ను మరింత సురక్షితంగా, క్లీన్‌గా మార్చే మార్గం. మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు DNS మీ ఫోన్‌ను సరైన సర్వర్‌కు కలుపుతుంది. మీరు గనుక dns.adguard.com వంటి అడ్-బ్లాకింగ్ DNSని ఉపయోగిస్తే, ప్రకటనలకు సంబంధించిన సర్వర్లు ముందే బ్లాక్ చేయబడతాయి.
స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్:
- ముందుగా మీ ఫోన్లోని Settings కి వెళ్లండి.
- అక్కడ Network & Internet లేదా Connection & Sharing అనే ఆప్షన్ ఎంచుకోండి.
- కింద ఉన్న Private DNS పై క్లిక్ చేయండి. సాధారణంగా ఇది ‘Off’ లేదా ‘Automatic’ లో ఉంటుంది.
- దానిని Private DNS Provider Hostname కు మార్చండి.
- అక్కడ ఖాళీ బాక్స్‌లో dns.adguard.com అని టైప్ చేసి ‘Save’ చేయండి. వెంటనే ప్రకటనలు రావడం ఆగిపోతాయి.
