“టెస్టుల్లో తొలి సెంచరీతో అదరగొట్టిన యువ బ్యాటర్!” నంబర్-3 స్థానానికి ఇక ఆ టెన్షన్ లేదు గురూ… లేచి నిలబడి చప్పట్లతో కొనియాడిన గంభీర్, అగార్కర్!

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ తన కెరీర్‌లో తొలి అంతర్జాతీయ టెస్ట్ సెంచరీ నమోదు చేసి సత్తా చాటాడు.

గాలే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పడిక్కల్ సాధించిన ఈ ఘనత టీమిండియా శిబిరంలో సరికొత్త జోష్ నింపింది.

ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తన క్లాసిక్ ఇన్నింగ్స్‌తో మూడంకెల స్కోరును అందుకోగానే.. పెవిలియన్‌లో కూర్చున్న భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరియు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇద్దరూ లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు.

టీమిండియా జెర్సీలో ఉన్న గంభీర్ చిరునవ్వుతో పడిక్కల్ ఇన్నింగ్స్‌ను ప్రశంసించగా, అటు సెలెక్టర్ అగార్కర్ కూడా చప్పట్లు కొడుతూ ఈ ప్రత్యేక విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. వీరిద్దరి ఉత్సాహభరిత స్పందన పడిక్కల్ సాధించిన ఈ రీ-ఎంట్రీ ఇన్నింగ్స్ ప్రాముఖ్యతను స్పష్టం చేస్తోంది.

గతంలో 2024-25 బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిన తర్వాత పడిక్కల్‌కు జట్టులో రెగ్యులర్‌గా అవకాశాలు రాలేదు. అయితే ఈ గాలే టెస్టులో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు.

ముఖ్యంగా భారత టెస్ట్ జట్టులో నంబర్-3 బ్యాటింగ్ స్థానానికి చాలా కాలంగా ఉన్న లోటును ఈ సెంచరీ భర్తీ చేసింది. 2024 సెప్టెంబర్‌లో చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ చేసిన తర్వాత, నంబర్-3 స్థానంలో దాదాపు 7 మంది వేర్వేరు ఆటగాళ్లను పరీక్షించినప్పటికీ ఒక్కరూ సెంచరీ చేయలేకపోయారు. ఆ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పడిక్కల్ టీమిండియా మేనేజ్‌మెంట్‌కు పక్కా భరోసా ఇచ్చాడు.


Posted

in

by

Tags: