టేబుళ్లపై రూ.237 కోట్ల నగదు కుప్పలు.. 15 నిమిషాల్లో ఎంత కావాలంటే అంత తీసుకెళ్లవచ్చు! పండగ చేసుకుంటున్న ఉద్యోగులు.

చైనాలోని ఒక కంపెనీ 800 టేబుళ్లపై భారీగా నగదును కుప్పలుగా పోసి, కేవలం 15 నిమిషాల్లో ఉద్యోగులు ఎంత డబ్బునైనా లెక్కపెట్టి బోనస్‌గా తీసుకెళ్లవచ్చని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధారణంగా కంపెనీలు బోనస్ ఇవ్వడానికే వెనకాడుతుంటాయి. కానీ చైనాలోని ‘హెనాన్ క్వాంగ్‌షాన్ క్రేన్’ (Henan Kuangshan Crane) అనే కంపెనీ తన వార్షికోత్సవం సందర్భంగా దాదాపు 180 మిలియన్ యువాన్లను (భారత కరెన్సీలో సుమారు రూ.237 కోట్లు) టేబుళ్లపై ఉంచింది.

బోనస్ రూల్స్ ఇవే: దాదాపు 7,000 మంది ఉద్యోగులను ఒక గదిలోకి పిలిచారు. అక్కడ టేబుళ్లపై 100 యువాన్ నోట్ల కట్టలను ఉంచారు. ప్రతి ఉద్యోగికి 15 నిమిషాల సమయం ఇచ్చారు. ఆ సమయంలో వారు ఎంత నగదును లెక్కపెట్టి తీసుకోగలిగితే, అంతా వారికే బోనస్‌గా ఇస్తామని కంపెనీ ప్రకటించింది. ఉద్యోగులు పోటీపడి మరీ డబ్బును అల్లి వెళ్లారు. ఫిబ్రవరి 13న జరిగిన ఈ వేడుకలో ఉద్యోగులందరూ చాలా సంతోషంగా కనిపించారు.

కంపెనీ యజమాని ఏమన్నారంటే? కంపెనీ చైర్మన్ ‘కుయ్ పీజున్’ (Cui Peijun) మాట్లాడుతూ.. “మేము ఉద్యోగులకు వాషింగ్ మెషీన్లు, బంగారు ఆభరణాలు ఎందుకు ఇవ్వాలి? దానికి బదులు నగదు ఇస్తే వారికి నచ్చింది కొనుక్కుంటారు. ఈ ఏడాది వచ్చిన 270 మిలియన్ యువాన్ల లాభంలో 70% (దాదాపు 180 మిలియన్ యువాన్లు) బోనస్‌గా పంచాలని నిర్ణయించుకున్నాను. నేటి యువతకు కార్ లోన్లు, హోమ్ లోన్లు ఉన్నాయి. మేము ఇచ్చే ఈ బోనస్ వారి ఆర్థిక భారాలను తగ్గిస్తుంది” అని తెలిపారు.

ఈ కంపెనీ ఇలా వింతగా బోనస్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది కూడా భారీగా లాభాలు రావడంతో ఉద్యోగులకు భారీ మొత్తంలో బోనస్ పంపిణీ చేసింది.


Posted

in

by

Tags: