“డాక్టర్‌కు చెప్పవద్దు!” చాట్‌జీపీటీ చెప్పిన పచ్చి అబద్ధం. శరీరంలో మిగిలి ఉన్న అతి తక్కువ మందుల మోతాదు. పోస్టుమార్టంలో వెలుగుచూసిన సంచలన నిజం.!!

అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన 31 ఏళ్ల చైనాకు చెందిన బోవెన్ వాన్ అనే మహిళ ఫిబ్రవరి నెలలో మరణించింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యాప్ ‘చాట్‌జీపీటీ’ ఇచ్చిన తప్పుడు వైద్య సలహాల వల్లే ఆమె మరణించిందని ఆరోపిస్తూ ఆమె తల్లిదండ్రులు ఓపెన్ఏఐ (OpenAI) సంస్థపై కేసు వేశారు.

జాన్స్ హాప్‌కిన్స్ తదితర ప్రముఖ సంస్థల అధ్యయనాలకు సంబంధించిన వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మూర్ఛ వ్యాధితో (Epilepsy) బాధపడుతున్న వాన్, దాని కోసం రోజూ మందులు వాడుతుండేది. అయితే ఉద్యోగ ఇంటర్వ్యూలు, గ్రీన్ కార్డ్ దరఖాస్తు సమయంలో ఈ మందుల వల్ల తన మాటల తీరుపై ప్రభావం పడుతుందేమోనని భయపడిన వాన్.. మందుల మోతాదును తగ్గించడం గురించి చాట్‌జీపీటీని సలహా అడిగింది.

దానికి బదులిచ్చిన చాట్‌జీపీటీ, కొద్ది వారాల్లోనే మందుల మోతాదును పూర్తిగా సున్నాకు తగ్గించడానికి ఓ షెడ్యూల్‌ను సిద్ధం చేసి ఇవ్వడమే కాకుండా, ఈ విషయాన్ని డాక్టర్లకు చెప్పవద్దని సలహా ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. మందుల మోతాదును తగ్గించడం వల్ల వాన్‌కు మైకం, మతిమరుపు, తీవ్రమైన తలనొప్పి వంటివి తలెత్తాయి.

అయితే, మెదడు కొత్త మార్పులకు అలవాటు పడుతున్నప్పుడు ఇలాంటి లక్షణాలు సహజమేనని చెప్పి చాట్‌జీపీటీ ఆమెను నమ్మించింది. అంతేకాకుండా ఆమె చనిపోవడానికి ఒకరోజు ముందు వాన్ అడిగిన ప్రశ్నకు కూడా, ఆ నొప్పి ప్రమాదకరం కాదని బదులిచ్చింది. ఆ తర్వాతి రోజే ఆమె విగతజీవిగా కనిపించింది. పోస్టుమార్టంలో ఆమె శరీరంలో మందుల మోతాదు చాలా తక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయింది.

ఈ ఘటన పట్ల ఓపెన్ఏఐ సంస్థ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఇది పాత మోడల్‌ ఏఐలో జరిగిన ఘటన అని, కొత్త మోడల్స్‌లో ఇలాంటి అత్యవసర వైద్య పరిస్థితులను గుర్తించి హెచ్చరించే సామర్థ్యం ఉందని వివరణ ఇచ్చింది. అయితే, మనుషుల ప్రాణాలకు సంబంధించిన వైద్య సలహాలను ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఇవ్వడాన్ని పూర్తిగా నిషేధించాలని బోవెన్ వాన్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.


Posted

in

by

Tags: