“డీల్ లేదు..” ట్రంప్‌కే చెక్ పెట్టిన యూరోపియన్ యూనియన్.. ఇది ఆయన అస్సలు ఊహించి ఉండరు!

గ్రీన్‌ల్యాండ్ విషయంలో తన మాట వినని యూరోపియన్ దేశాలపై భారీగా పన్నులు (Taxes) విధిస్తానని డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అయితే, దీనికి ధీటుగా సమాధానం చెప్పడానికి మొత్తం యూరోపియన్ యూనియన్ ఏకమైంది. అమెరికాతో కుదుర్చుకున్న కీలక వాణిజ్య ఒప్పందాన్ని (Trade Deal) నిలిపివేస్తున్నట్లు EU ప్రకటించింది. ఇది ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బగానే భావిస్తున్నారు.

వివాదం ఏమిటి? ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్ ప్రస్తుతం డెన్మార్క్ దేశం ఆధీనంలో ఉంది. అక్కడ చైనా, రష్యాల ప్రభావం పెరుగుతుండటంతో, అమెరికా జాతీయ భద్రత దృష్ట్యా గ్రీన్‌ల్యాండ్‌ను తమకు అప్పగించాలని ట్రంప్ కోరుతున్నారు. దీనిని నిరాకరించిన డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ సహా ఆరు యూరోపియన్ దేశాలపై పన్నులు విధిస్తానని ఆయన బెదిరించారు.

యూరోపియన్ యూనియన్ ప్రతిస్పందన: ట్రంప్ హెచ్చరికలకు భయపడకుండా, అమెరికాతో గత ఏడాది కుదుర్చుకున్న కొన్ని ముఖ్యమైన వాణిజ్య రాయితీలను ఐరోపా పార్లమెంట్ వాయిదా వేసింది. ఈ ఒప్పందం రద్దు కానప్పటికీ, ట్రంప్‌కు ఇదొక హెచ్చరిక సందేశం. ఒకవేళ ట్రంప్ వెనక్కి తగ్గకపోతే, అమెరికాపై సుమారు 93 బిలియన్ యూరోల ($108 బిలియన్లు) భారీ పన్నులు విధించే ఆలోచనలో EU ఉంది. గ్రీన్‌ల్యాండ్ అంశంపై చర్చించేందుకు యూరోపియన్ దేశాధినేతలు నేడు బ్రస్సెల్స్‌లో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు.


Posted

in

by

Tags: