ఢిల్లీ శివార్లలోని సైబర్ సిటీ గురుగ్రామ్, సెక్టార్-53 ప్రాంతంలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. 29 ఏళ్ల యువకుడు యవ్వనశక్తిని పెంచే మందులను (Sex-enhancing drugs) అధిక మోతాదులో తీసుకోవడం వల్ల మరణించినట్లు అనుమానిస్తున్నారు. ఈ మందుల ప్రభావంతో అతనికి గుండెపోటు వచ్చి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఏం జరిగింది? మృతుడిని నాగ్‌పూర్‌కు చెందిన రోహిత్ లాల్‌గా గుర్తించారు. అతను ఢిల్లీలోని ‘క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ (QCI)లో పనిచేస్తూ, గురుగ్రామ్‌లోని ఒక పిజి (PG)లో ఉంటున్నాడు. గురువారం ఉదయం తన సహోద్యోగి అతన్ని పిలవడానికి రాగా, అతను ఫోన్ ఎత్తలేదు, తలుపులు కూడా తీయలేదు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు పగలగొట్టి చూడగా, రోహిత్ మంచంపై విగతజీవిగా పడి ఉన్నాడు. గదిని సోదా చేయగా, కొన్ని హెల్త్ సప్లిమెంట్లు మరియు శక్తిని పెంచే మందుల ఖాళీ ప్యాకెట్లు లభించాయి.
కాబోయే భార్య కోసం ఎదురుచూస్తూ.. విచారణలో వెల్లడైన విషయాల ప్రకారం, రోహిత్ తన కాబోయే భార్యను కలవడానికి పిలిచాడు. ఆమె రావడానికి ముందే అతను ఈ మందులను సేవించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మందుల ఓవర్ డోస్ వల్ల అతని శరీర వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి, గుండెపోటుకు దారితీసి ఉండవచ్చని సీనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తెలిపారు.
పోలీసుల విచారణ: సెక్టార్-53 ఎస్హెచ్ఓ (SHO) సతేందర్ రావల్ మాట్లాడుతూ, “పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాం. గదిలో లభించిన మందుల ప్యాకెట్లను మరియు విసరా (Viscera) నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి (FSL) పంపాం. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణం తెలుస్తుంది” అని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
