తన స్వలింగ సంపర్కానికి (Lesbian Relationship) అడ్డుగా ఉన్నాడనే కారణంతో, ఒక మహిళ తన ప్రియురాలితో కలిసి భర్తను కిరాయి మూఠాతో దారుణంగా హత్య చేయించిన ఘటన సంచలనం సృష్టించింది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుమర్ సింగ్ (33) అనే రైతు ఇటీవల పొలంలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. అతని శరీరంపై గాయాలు ఉండటంతో, పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పంపారు.
పోలీసుల దర్యాప్తులో తేలిన భయంకర నిజాలు: పోలీసులు జరిపిన విచారణలో సుమర్ సింగ్ భార్య రేణు దేవి (28), ఆమె స్నేహితురాలు మాల్తీ దేవి (27) ఈ హత్యకు ప్రధాన సూత్రధారులని తేలింది. మాల్తీ దేవికి ఇదివరకే మూడు పెళ్లిళ్లు అయ్యి భర్తలకు విడిపోగా, ఆమెకు రేణు దేవితో గత కొంతకాలంగా స్వలింగ సంపర్క బంధం ఉంది.
సుమర్ సింగ్ ఇంట్లో లేని సమయంలో మాల్తీ దేవి అక్కడికి వచ్చి రేణుతో గడిపేది. ఒకరోజు సుమర్ సింగ్ పని ముగించుకుని హఠాత్తుగా ఇంటికి వచ్చేసరికి, వీరిద్దరూ ఏకాంతంగా ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. దీనివల్ల కుటుంబంలో తీవ్ర గొడవలు జరిగాయి. మాల్తీ దేవి తమ ఇంటికి రాకూడదని సుమర్ సింగ్ కుటుంబ సభ్యులు తీవ్రంగా హెచ్చరించారు.
రూ. 60 వేలకు ఒప్పందం: తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకున్న రేణు దేవి, తన స్నేహితురాలితో కలిసి జితేంద్ర గుప్తా అనే వ్యక్తికి సుమర్ సింగ్‌ను చంపమని ‘సుపారీ’ ఇచ్చింది. దీనికోసం రూ. 60 వేలకు ఒప్పందం కుదుర్చుకుని, రూ. 8 వేలు అడ్వాన్స్‌గా చెల్లించారు.
పథకం ప్రకారం, జితేంద్ర గుప్తా తన అనుచరులతో కలిసి సుమర్ సింగ్‌ను గొంతు నులిమి, సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని పొలంలో పడేశారు. ప్రస్తుతం పోలీసులు రేణు దేవి, మాల్తీ దేవి మరియు కిరాయి మూఠాకు చెందిన రాజు సోంకర్ అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న జితేంద్ర గుప్తా మరియు రామ్ ప్రకాష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
