పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ కైనత్ ఇంతియాజ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించింది. కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన ఆమె, గత 13 ఏళ్లుగా పాకిస్థాన్ జాతీయ జట్టు కోసం ఎన్నో మ్యాచ్‌లలో ఆడి తన వంతు పాత్ర పోషించింది. మైదానంలో క్రీడాకారిణిగా ఆమె ప్రయాణం ముగిసినప్పటికీ, క్రికెట్‌తో ఆమెకున్న బంధం మాత్రం అలాగే కొనసాగుతోంది.
క్రికెట్ ఆటకు వీడ్కోలు పలికిన వెంటనే, ఆమె మ్యాచ్ రిఫరీగా తన తదుపరి ప్రయాణాన్ని కొత్త పాత్రలో ప్రారంభించింది. కొన్ని నెలల క్రితం జరిగిన జాతీయ అండర్-19 మహిళల టీ20 క్రికెట్ టోర్నీలో ఆమె మ్యాచ్ రిఫరీగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీని ద్వారా భవిష్యత్తులో ఆమె మ్యాచ్‌లలో ఆడే క్రీడాకారిణిగా కాకుండా, ఆటను పర్యవేక్షించే కీలక అధికారిగా (మ్యాచ్ రిఫరీగా) వ్యవహరించనుంది.
తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో 19 వన్డేలు, 21 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆమె.. 2017 మహిళల ప్రపంచకప్‌తో పాటు, ఆసియా క్రీడల్లో రెండుసార్లు స్వర్ణం గెలిచిన పాకిస్థాన్ జట్టులో సభ్యురాలిగా ఉండి దేశానికి గర్వకారణంగా నిలిచింది. అంతేకాకుండా, ఆమె తల్లి సలీమా ఇంతియాజ్ పాకిస్థాన్‌లో ప్రముఖ మహిళా అంపైర్‌గా వ్యవహరిస్తుండగా.. ఇప్పుడు కూతురు కూడా మ్యాచ్ రిఫరీగా మారడం ఆ క్రికెట్ కుటుంబానికి మరింత గుర్తింపును, బలాన్ని చేకూర్చింది.

Leave a Reply