చెన్నై పెరంబూర్ రైల్వే స్టేషన్లో గత జూన్ 5వ తేదీన ఒక సూట్‌కేస్‌లో తల లేని పురుషుడి మృతదేహం లభ్యమైన ఘటన తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు, హత్యకు గురైన వ్యక్తిని అమీర్ అలీగా గుర్తించారు. ఈ ఘోర హత్యతో సంబంధం ఉన్న అతని భార్య రహీమా, అలాగే ఆమె మిత్రుడు అస్రమ్ అలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన వీరిని పట్టుకుని విచారించగా.. భర్త అక్రమ సంబంధాలు, కుటుంబ తగాదాలే ఈ దారుణ హత్యకు కారణమనే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
భార్య ఇచ్చిన భయంకరమైన వాంగ్మూలం
అరెస్ట్ అయిన రహీమా పోలీసులకు ఇచ్చిన విస్తుపోయే వాంగ్మూలంలో.. అమీర్ అలీ తనకు రెండో భర్త అని, అతను చాలా మంది మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని తెలిపింది. దీనిని నిలదీసినప్పుడల్లా, తన మొదటి వివాహ జీవితం గురించి మాట్లాడుతూ అమీర్ అలీ తను నిరంతరం వేధిస్తూ, శారీరకంగా హింసించేవాడని పేర్కొంది.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రహీమా, తన స్నేహితుడు అస్రామ్ అలీ సహాయంతో భర్తను హతమార్చింది. అనంతరం అతని జననేంద్రియాన్ని కోసేసి, మృతదేహాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు శరీర భాగాలను వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు ఒప్పుకుంది. హత్యకు గురైన అమీర్ అలీ తల ఇంకా లభ్యం కాకపోవడంతో, నిందితురాలు ఇచ్చిన సమాచారం మేరకు గిండి మరియు తేనాంపేట పరిసర ప్రాంతాలలో పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
