తెరిచి ఉన్న లిఫ్ట్ తలుపు.. గమనించకుండా అడుగు వేయబోయిన బాలుడు.. ప్రాణదాతగా మారిన సెక్యూరిటీ గార్డు! వణికించే వీడియో

ఒక అపార్ట్‌మెంట్ రిసెప్షన్ ఏరియాలో లిఫ్ట్ తలుపులు తెరిచి ఉన్నాయి. అయితే లోపల లిఫ్ట్ బాక్స్ లేదు. ఆ ప్రమాదాన్ని గమనించకుండా లిఫ్ట్ వైపు వెళ్లిన ఒక చిన్నారిని, అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు మెరుపు వేగంతో స్పందించి కాపాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలేం జరిగింది? వైరల్ అవుతున్న ఆ వీడియోలో, లిఫ్ట్ రాకముందే సాంకేతిక లోపం వల్ల తలుపులు తెరిచి ఉండటాన్ని మనం చూడవచ్చు. ఒక చిన్న బాలుడు ఆడుకుంటూ అటువైపు వెళ్లాడు. లోపల ఫ్లోర్ లేదని, అడుగు వేస్తే నేరుగా కింద పడిపోతానని తెలియని ఆ పసివాడు లిఫ్ట్ గుంత వైపు తడబడుతూ నడిచాడు.

రియల్ హీరో.. సెక్యూరిటీ గార్డు! దగ్గరలోనే కూర్చుని ఉన్న సెక్యూరిటీ గార్డు, పరిస్థితి తీవ్రతను క్షణాల్లో గ్రహించాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన కుర్చీ నుండి గాలిలోకి దూకి, బాలుడిని పట్టుకుని పక్కకు లాగేశాడు. ఆ గార్డు సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని నెటిజన్లు వేనోళ్ల కొనియాడుతున్నారు. అతడిని “నిజమైన హీరో” అని అభివర్ణిస్తున్నారు.

విమర్శలు: ఈ ఘటనపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఒకవైపు గార్డును ప్రశంసిస్తూనే, మరోవైపు తల్లిదండ్రుల అజాగ్రత్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలను అంత ప్రమాదకరమైన చోట వదిలేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అలాగే, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా, లిఫ్ట్ బాక్స్ లేకుండానే తలుపులు తెరిచి ఉంచిన అపార్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్‌పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


Posted

in

by

Tags: