“దయచేసి మాకు నీళ్లివ్వండి..” భారత్‌ను వేడుకుంటున్న పాకిస్థాన్.. కరువు కోరల్లో చిక్కుకునేలా ఉంది!

ఇస్లామాబాద్: పహల్గామ్ దాడి తర్వాత సింధు నదీ జలాల ఒప్పందం నుండి భారత్ వైదొలగడం పాకిస్థాన్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఇది ఆ దేశంలో తీవ్ర నీటి ఎద్దడికి దారితీసే ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో, భారత్ ఒప్పందాన్ని అమలు చేసి తమకు నీటిని విడుదల చేయాలని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ప్రాధేయపడే స్థాయికి దిగివచ్చారు.

నేపథ్యం: గతేడాది మే నెలలో భారత్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన అత్యంత ఘోరమైన దాడి దేశాన్ని వణికించింది. దీనికి ప్రతిచర్యగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా వివిధ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే 60 ఏళ్లుగా ఉన్న సింధు నదీ జలాల ఒప్పందం నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. సింధు నదిపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్న పాకిస్థాన్‌కు ఇది పెద్ద షాక్. “రక్తం, నీరు ఒకే మార్గంలో ప్రవహించలేవు” (Water and blood cannot flow together) అని భారత్ స్పష్టం చేసింది.

పాకిస్థాన్ అధ్యక్షుడు ఏమన్నారంటే? పాకిస్థాన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న జర్దారీ మాట్లాడుతూ.. “నీటి వనరులను ఆయుధాలుగా మార్చుకోవడం ఆందోళనకరం. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం 60 ఏళ్లుగా ఉన్న అంతర్జాతీయ ఒప్పంద ప్రాధాన్యతను తగ్గిస్తోంది. ఇది మా ఆర్థిక భద్రతను దెబ్బతీయడమే కాకుండా, ఈ నీటిపై ఆధారపడిన లక్షలాది మంది ప్రజల జీవనాధారాన్ని ప్రమాదంలో పడేస్తోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.

దుర్భర స్థితి: భారత్ నీటిని నిలిపివేయడంతో పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో నీటి కరువు తాండవిస్తోంది. ప్రజలు కొద్దిపాటి నీటి కోసం మైళ్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ముఖ్యంగా మహిళలు, బాలికలు నీటిని సేకరించడానికే రోజూ గంటల కొద్దీ సమయాన్ని వెచ్చిస్తున్నారు. దీనివల్ల వారి విద్య, ఉపాధి దెబ్బతింటున్నాయని జర్దారీ పేర్కొన్నారు. వర్షపు నీటిని పొదుపు చేయాలని, భూగర్భ జలమట్టం పెంచేలా ప్రజలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.


Posted

in

by

Tags: