దారుణం: క్షుద్రపూజల కోసం ప్రియురాలిని చంపి.. ‘జరిగిందేదో జరిగింది’ అంటూ వికృత నవ్వు!

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, ద్వారకాపురి ప్రాంతంలో జరిగిన ఒక భయంకరమైన హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తన ప్రియురాలిని అత్యంత క్రూరంగా హతమార్చిన నిందితుడు పీయూష్ ధామనోడియా ముఖంలో ఏమాత్రం భయం లేదా పశ్చాత్తాపం కనిపించడం లేదు.

హత్య జరిగిన తీరు: ఫిబ్రవరి 10న నిందితుడు పీయూష్ ఆ విద్యార్థినిని తన గదికి పిలిచాడు. ఇద్దరూ కలిసి భోజనం చేసిన తర్వాత, అతను శారీరక సంబంధం కోసం ఒత్తిడి తెచ్చాడు. ఆమె నిరాకరించడంతో బలవంతంగా అత్యాచారం చేశాడు. ఆపై ‘సర్ప్రైజ్ గిఫ్ట్’ ఇస్తానని నమ్మించి ఆమె కళ్లకు గంతలు కట్టి, కాళ్లు చేతులు తాళ్లతో కట్టేశాడు. ఆమె ప్రతిఘటించడంతో నోట్లో గుడ్డలు కుక్కి, ఛాతిపై కూర్చుని గొంతు నులిమి చంపేశాడు.

వికృత చేష్టలు:

  • మృతదేహం వద్ద మద్యం: హత్య చేసిన తర్వాత బయటకు వెళ్లి బీరు కొనుక్కుని వచ్చి, శవం పక్కనే కూర్చుని తాగాడు. మృతదేహంపై కూడా పైశాచికత్వానికి పాల్పడినట్లు సమాచారం.
  • ఆత్మ కోసం క్షుద్రపూజలు: హత్య అనంతరం ముంబైకి పారిపోయిన నిందితుడు, అక్కడ అడవిలో క్షుద్రపూజలు చేస్తూ పోలీసులకు దొరికాడు. యూట్యూబ్ వీడియోలు చూస్తూ చనిపోయిన ప్రియురాలి ఆత్మను రప్పించి మాట్లాడాలని ప్రయత్నించాడు.
  • డిజిటల్ హింస: ఆమెను బద్నాం చేయడానికి, వారిద్దరి ఏకాంత వీడియోలను కాలేజీ గ్రూపుల్లో షేర్ చేయడమే కాకుండా, ఆమె వాట్సాప్ స్టేటస్‌లో కూడా పెట్టాడు.

నిందితుడి అహంకారం: పోలీసులు అతడిని కోర్టుకు తీసుకెళ్తున్నప్పుడు మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడగగా.. ఏమాత్రం భయం లేకుండా నవ్వుతూ “వదిలేయండి భయ్యా! జరిగిందేదో జరిగింది (Jo hua so ho gaya). కారణం తెలుసుకుని ఏం చేస్తారు? సమయం వచ్చినప్పుడు అందరికీ వివరంగా చెబుతాను” అని సమాధానమిచ్చాడు.


Posted

in

by

Tags: