దిగ్భ్రాంతి. టీచర్‌ను బడి గేటు వద్దకే పిలిచి గొంతు కోసి హత్య. మాజీ విద్యార్థి ఉన్మాదం. సీసీటీవీలో రికార్డైన షాకింగ్ దృశ్యాలు.!!

హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ జిల్లా సిక్రోనా ప్రాంతంలో జూన్ 29న ఉదయం 9:30 గంటల సమయంలో ఒక భయానక ఘటన చోటుచేసుకుంది.

పాఠశాలకు వచ్చిన ఒక వ్యక్తి, అక్కడ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సంధ్య అనే ఆమెను కలవాలని చెప్పాడు. సంధ్య పాఠశాల ప్రవేశ ద్వారం వద్దకు రాగానే, ఆమెను ఉపాయంతో బయటకు రప్పించిన ఆ వ్యక్తి, తాను దాచి ఉంచిన కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి పొడిచాడు.

ఆ సమయంలో సమీపంలో ఉన్న మరొక వ్యక్తి అడ్డుకోవడానికి ప్రయత్నించగా, హంతకుడు కత్తి చూపించి అతనిని కూడా బెదిరించి వెనక్కి తగ్గేలా చేశాడు. ఆ తర్వాత, సంధ్య గొంతు భాగంలో మళ్లీ దారుణంగా పొడిచి అక్కడి నుండి పరారయ్యాడు. రక్తపు మడుగులో తీవ్రంగా గాయపడిన సంధ్యను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దాడికి పాల్పడిన వ్యక్తి ఆ పాఠశాల మాజీ విద్యార్థి అయిన అమిత్ అని గుర్తించి అతనిని అరెస్టు చేశారు. అమిత్, టీచర్ సంధ్యను ప్రేమిస్తున్నానని చెబుతూ నిరంతరం వేధింపులకు గురిచేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దారుణ దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ పాఠశాలలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *