దివ్యాంగుడైన కొడుకుకే విషమిచ్చిన తండ్రి; కారణం తెలిస్తే షాక్ అవుతారు!

బెంగళూరు, జనవరి 04: కన్నపిల్లలను సాకడం కోసం తల్లిదండ్రులు ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుంటారు. తమకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా పిల్లల ముఖం చూసి ఆ బాధను మర్చిపోతుంటారు. కానీ ఇక్కడొక తండ్రి మాత్రం, అనారోగ్యంతో ఉన్న కొడుకు చికిత్సకు డబ్బుల్లేక, ఆ చిన్నారికి విషం పెట్టిన అమానుష ఘటన బెంగళూరులో వెలుగుచూసింది.

చిన్నారి పరిస్థితి విషమం:

బాగలూరు నివాసితులైన సత్య మరియు మునికృష్ణ దంపతుల కుమారుడు జోయల్, పుట్టినప్పటి నుండి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో మరియు దివ్యాంగుడిగా (Special Child) ఉన్నాడు.

  • మానసిక ఒత్తిడి: బాబు చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టూ తిరగడం, పెరుగుతున్న ఖర్చులతో తండ్రి మునికృష్ణ మానసిక కుంగుబాటుకు లోనయ్యాడు.
  • ఘటన: డిసెంబర్ 22న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాబు నోటి నుండి నురగ రావడాన్ని గమనించిన తల్లి, అమ్మమ్మ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఇందిరాగాంధీ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో వెెంటిలేటర్ సహాయంతో మృత్యువుతో పోరాడుతున్నాడు. భార్య సత్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మునికృష్ణపై కేసు నమోదు చేశారు.
పురుగుల మందు కలిపానని ఒప్పుకున్న తండ్రి:

ఈ ఘటనపై నిందితుడైన తండ్రి మునికృష్ణ మాట్లాడుతూ తన నేరాన్ని అంగీకరించాడు:

“నా కొడుకు చికిత్సకు నా దగ్గర డబ్బుల్లేవు. నాకు ఎవరూ సహాయం చేయలేదు. డాక్టర్లు కూడా నయం కాదని చేతులెత్తేశారు. నేను పని చేసే చోట మొక్కలకు కొట్టే పురుగుల మందును (50 ml) తీసుకువచ్చి కొడుకు ఆహారంలో కలిపాను. చికిత్స కోసం ఇప్పటికే చాలా అప్పులు చేశాను, అందుకే ఈ పని చేశాను.”


Posted

in

by

Tags: