దీపావళి పండుగ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఉద్యోగులకు ప్రత్యేక బహుమతులు అందించింది. డ్రై ఫ్రూట్స్‌తో కూడిన అందమైన గిఫ్ట్ బాక్స్‌లను పంపిణీ చేసి ఉద్యోగులను సర్‌ప్రైజ్ చేసింది.
రిలయన్స్ జియోలో పనిచేస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తనకు అందిన బహుమతి పెట్టెను తెరిచి చూపిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
తెలుపు రంగులో ఉన్న ఈ గిఫ్ట్ బాక్స్‌లో జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అంతేకాకుండా ముఖేష్ అంబానీ, నీతా అంబానీతో పాటు వారి కుటుంబ సభ్యుల తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలిపే ప్రత్యేక గ్రీటింగ్ కార్డు కూడా అందులో ఉంది.
గత సంవత్సరాల్లోనూ రిలయన్స్ సంస్థ తమ ఉద్యోగులకు ఇలాంటి డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్ బాక్స్‌లను అందించినట్లు సమాచారం.
అంబానీ కుటుంబం నుంచి అందిన ఈ దీపావళి కానుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
