“దేశ సరిహద్దులను కాపాడటానికి వెళ్తే.. నా శీలాన్నే దోచేశారు”.. తోటి సైనికుల ఘోర అకృత్యం.. గర్భస్రావం చేసుకుని కన్నీరుమున్నీరైన మహిళా జవాన్..!!

డబ్లిన్: మిలిటరీ క్యాంప్‌లో తోటి సైనికుల బృందం తనపై జరిపిన ఘోర సామూహిక అత్యాచారాన్ని (Gang Rape) వివరిస్తూ ఐర్లాండ్ రక్షణ దళానికి చెందిన ఒక మాజీ మహిళా సైనికురాలు ట్రిబ్యునల్ ముందు కన్నీరుమున్నీరయ్యారు.

1990ల కాలంలో రిజర్వ్ రక్షణ దళంలో చేరి, ఆ తర్వాత 2010 చివరి వరకు పూర్తిస్థాయి సైనికురాలిగా సేవలందించిన ఆమె.. తనకు 19 ఏళ్ల వయసున్నప్పుడు మిలిటరీ క్యాంప్ క్వార్టర్స్‌లో అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఈ ఘోర అటాక్ జరిగినట్లు పేర్కొన్నారు. అర్థరాత్రి వేళ ఇద్దరు లేదా ముగ్గురు సైనికులు తన పడకగదిలోకి చొరబడి, దుస్తులు తొలగించి తనపై పాశవికంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారని, ఈ దారుణం వల్ల తాను గర్భవతినయ్యానని తెలిసి పూర్తిగా కుంగిపోయానని ఆమె తెలిపారు. ఆ తర్వాత తాను గర్భస్రావం (Abortion) చేయించుకోవాల్సి వచ్చిందని, ఆనాటి భయంకరమైన జ్ఞాపకాలు తనను జీవితాంతం వెంటాడుతూనే ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సైన్యం నుండి బహిష్కరిస్తామని బెదిరింపులు:
ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం నిందితుల పేర్లను ప్రస్తుతానికి రహస్యంగా ఉంచినప్పటికీ.. “ఈ సామూహిక అత్యాచారం గురించి బయటకు చెబితే నిన్ను సైన్యం నుండి రౌడీల్లా బహిష్కరిస్తాం” అని ఆ సైనికులు తనను తీవ్రంగా బెదిరించినట్లు బాధితురాలు సాక్ష్యమిచ్చారు. ఎల్లప్పుడూ దేశ రక్షణ దళంలో పనిచేయాలనే బలమైన కల ఉన్నందున, ఎక్కడ ఉద్యోగం కోల్పోతానేమోననే భయంతోనూ, ఆందోళనతోనూ, సమాజం తనను నమ్ముతుందో లేదోననే అనుమానంతోనూ ఇన్నేళ్లపాటు ఆమె ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.

రక్షణ దళాలలో మహిళలపై జరిగే ఇలాంటి దారుణమైన వేధింపులు, ఫిర్యాదులను పరిష్కరించడానికి సైన్యానికి ఏమాత్రం సంబంధం లేని, రక్షణ దళ మాజీ సభ్యులు ఎవరూ లేని ఒక పూర్తి స్వతంత్రమైన ప్రత్యేక దర్యాప్తు వ్యవస్థను (Independent Investigative Body) ఏర్పాటు చేయాలని ఆమె ట్రిబ్యునల్‌ను గట్టిగా డిమాండ్ చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *