“దొరికిపోతే పారిపోవాల్సిందే!” దొంగలపై రెడ్ కలర్ స్ప్రేతో దాడి.. రైల్వే స్టేషన్‌లో జరిగిన షాకింగ్ ఘటన.. వైరల్ అవుతున్న వీడియో..!!

స్పెయిన్‌లోని బార్సిలోనా రైల్వే స్టేషన్‌లో ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, ఒక మహిళపై ఎరుపు రంగు స్ప్రే కొట్టి తరిమికొట్టిన ఘటన ప్రస్తుతం ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారితీసింది.

‘వైల్డ్ ఆండ్రీ’ (Wild Andry) అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన ఈ వీడియోలో, ఆ మహిళ తరచూ చోరీలకు పాల్పడే పిక్‌పాకెటర్ అని ఆరోపించిన ఆ వ్యక్తి, జనసమూహంలో ఆమెను సులభంగా గుర్తించడానికే ఈ రంగు స్ప్రే కొట్టినట్లు తెలిపాడు.

పర్యాటకులను లక్ష్యంగా చేసుకునే దొంగలను పట్టుకోవడానికే తాము ఇలా చేస్తున్నామని ఆ పేజీ నిర్వాహకులు వైరల్ వీడియోలో పేర్కొన్నారు. ఆ మహిళపై రంగు చల్లగానే ఆమె గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి పరుగులు తీయడం, ఆ తర్వాత భద్రతా సిబ్బంది వైపు వెళ్లడం ఆ వీడియోలో కనిపిస్తోంది. అయితే, ఆ మహిళ నిజంగానే దొంగతనానికి పాల్పడిందా అనే విషయంపై పోలీసుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడకపోవడం గమనార్హం.

సోషల్ మీడియాలో ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి నెటిజన్ల మధ్య భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో పెరిగిపోతున్న దొంగతనాలను అరికట్టడానికి ఇలాంటి కఠిన చర్యలు అవసరమని కొందరు మద్దతు తెలుపుతున్నారు. అదే సమయంలో, సరైన ఆధారాలు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ఒకరిని ఇలా అవమానించడం, నిందలు వేయడం సరికాదని మరికొందరు తీవ్రంగా ఖండిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *